NTV Telugu Site icon

Jr.ఎన్టీఆర్ : దేవరకు సోమవారం పరిక్ష మొదలు..నిలుస్తాడా..?

Untitled Design (18)

Untitled Design (18)

జూనియర్ ఎన్టీఆర్‌ & కొరటాల శివల దేవర సెప్టెంబర్ 27న రిలీజ్ అయి మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. యంగ్ టైగర్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఎన్టీయార్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ అత్యంత భారీ బడ్జెట్ నిర్మించిన ఈ చిత్రంలో జాన్వీ కపూర్, సైఫ్ అలీఖాన్, మలయాళ నటుడు టామ్ చాకో కీలక పాత్రల్లో నటించారు. అనిరుధ్ మ్యూజిక్ సినిమాను వేరే లెవల్ కు తీసుకు వెళ్లిందనడంలో సందేహమే లేదు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను దేవర దండయాత్ర సాగుతుంది.

సెప్టెంబరు 27న రిలీజ్ అయిన దేవర మొదటి వీకెండ్ ముగించుకుంది. నేటి నుండి దేవరకు అసలు పరీక్ష మొదలైంది. మొదటి రోజు ఫ్యాన్స్ ఎలాగూ చూస్తారు, ఆ రోజు ఆల్మోస్ట్ థియేటర్స్ హౌస్ ఫుల్స్ తో ఉండడం కామన్. ఇక శని, ఆది వీకండ్ కావడంతో అన్ని ఏరియాలు ఫుల్స్ నడిచాయి. ఇక నాలుగవ రోజు అనగా ఈ సోమవారం నుండి దేవర అసలు పరీక్ష ఎదుర్కోబోతున్నాడు. ఈ రోజు కలెక్షన్స్ హోల్డ్ చేయగలిగితే దేవర ఈజీగా బ్రేక్ ఈవెన్ అవుతాడు. లేదంటే పోరాడాల్సి ఉంటుంది. అటు ఓవర్సీస్ లో సోమవారం అడ్వాన్స్ సేల్స్ లో భారీ డ్రాప్ కనిపించింది. ఆల్మోస్ట్ క్రాష్ అయిందనే చెప్పాలి. అది దేవర యూనిట్ ను టెన్షన్ పెడుతన్నా నార్త్ బెల్ట్ పుంజుకోవడం కొంత ఊరటనిస్తోంది. ఇదిలా ఉండగా మొదటి రెండు రోజులకు గాను వరల్డ్ వైడ్ గా రూ. 243 కోట్లు రాబట్టిందని అధికారకంగా పోస్టర్ రిలీజ్ చేసారు మేకర్స్. అంటే ప్రీ రిలీజ్ బిజినెస్ లో 70% కలెక్షన్స్ రికవరీ అయింది.

Show comments