బాలీవుడ్ స్టార్ జాన్ అబ్రహం హీరోగా నటిస్తున్న ‘సత్యమేవ జయతే 2’ విడుదలను వాయిదా వేశారు మేకర్స్. మిలాప్ జవేరి దర్శకత్వం వహించిన ‘సత్యమేవ జయతే 2’లో దివ్య ఖోస్లా కుమార్ హీరోయిన్ గా నటించారు. మే 13న విడుదల కావాల్సిన ఈ చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్టు మేకర్స్ అధికారికంగా తెలియజేశారు. కరోనా ఉధృతి తగ్గి, పరిస్థితులు చక్కబడ్డాక ‘సత్యమేవ జయతే 2’ మూవీ కొత్త విడుదల తేదీని ప్రకటించనున్నారు. కోవిడ్-19 సెకండ్ వేవ్ కారణంగా పరిస్థితులు దారుణంగా మారుతున్నాయి. దీంతో కరోనా మహమ్మారిని దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే విడుదల కావలసిన అన్ని పెద్ద సినిమాలను వాయిదా వేశారు. ఒక్క సల్మాన్ ఖాన్ ‘రాధే’ తప్ప. ‘రాధే’ మే 13న థియేటర్లు, ఓటిటిలో విడుదలవుతోంది. బాలీవుడ్ మాత్రమే కాదు అన్ని పరిశ్రమలు కూడా తాజా సినిమాల విడుదలను వాయిదా వేస్తున్నాయి. ఇక టాలీవుడ్ లో లాక్ డౌన్ అనంతరం విడుదలైన ‘వకీల్ సాబ్’ బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనం సృష్టించింది.
‘సత్యమేవ జయతే-2’ విడుదల వాయిదా
