Hero Dupes: డబ్బు పెట్టే వాడికి లేని నొప్పి మనకెందుకు? .. జేడీ కీలక వ్యాఖ్యలు

Jd Chakravarthy

Jd Chakravarthy

Hero Dupes: త్వరలో గాయపడ్డ సింహం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న జేడీ చక్రవర్తి వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవల సినిమా ఇండస్ట్రీలోని ” హీరోలకు డూప్స్ వాడకం ” అనే అంశంపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి. ప్రస్తుత కాలంలో స్టార్ హీరోలు సెట్స్‌కు రాకపోయినా, డూపులు, ఫేస్ స్వాప్ టెక్నాలజీతో సినిమాలు పూర్తి చేస్తున్నారనే విమర్శలపై ఆయన తనదైన శైలిలో స్పందించారు. సినిమా అనేది కోట్లాది రూపాయల వ్యాపారం. ఒక హీరో సెట్‌కు రావడం లేదని, డూపులతో మేనేజ్ చేస్తున్నారని తెలిసినా నిర్మాతలు, దర్శకులు ఎందుకు మౌనంగా ఉంటున్నారు? దానికి సమాధానం ఒక్కటే మార్కెట్ వాల్యూ. నిర్మాతకు కావాల్సింది లాభం.

హీరో సెట్‌కు వస్తున్నాడా లేదా అనేది వారికి సెకండరీ. సినిమా పూర్తయ్యి, థియేటర్లలో కాసులు కురిపిస్తే చాలు. సదరు హీరోకి ఉన్న క్రేజ్ వల్ల సినిమా అమ్ముడుపోతుంటే, నిర్మాతకు ఆ టెక్నికల్ అడ్జస్ట్‌మెంట్లతో పెద్దగా ఇబ్బంది లేదు. సినిమాని అనుకున్న టైమ్‌కి పూర్తి చేయడం దర్శకుడి బాధ్యత. హీరో డేట్స్ దొరకనప్పుడు లేదా ఇతర కారణాల వల్ల షూటింగ్‌కు రానప్పుడు, అందుబాటులో ఉన్న సాంకేతికతను వాడుకుని అవుట్‌పుట్ రాబట్టుకోవడమే ప్రాక్టికల్ అని వారు భావిస్తున్నారు. డబ్బులు పెట్టే వాళ్ళకి లేని నొప్పి మనకెందుకు… ఆడియన్స్ చూసేసి ఏంటి సింపుల్…కంటెంట్ నచ్చితే చూస్తారు లేదంటే చూడరు…ఈ డూపులు ఇవన్నీ పట్టించుకోరు…గెడ్డం దెగ్గర VFX… హెడ్ స్వాప్ అని మీరెందుకు బుర్రలు బాదుకుంటున్నారు…వాళ్ళే చెప్తున్నారుగా… మాకు ఆరు నెలలు VFX వర్క్ జరిగింది ఇంత ఖర్చు అయింది అని” అంటూ జేడీ కీలక వ్యాఖ్యలు చేశారు.