‘బీస్ట్’తో జానీ మాస్టర్ బర్త్ డే సెలెబ్రేషన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ నిన్న పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. దక్షిణాదిలో ఈ కొరియోగ్రాఫర్ కు మంచి పేరు ఉంది. దాదాపు సౌత్ లోని అగ్ర హీరోలందరితో తనదైన శైలిలో స్టెప్పులు వేయించాడు. అయితే ఇప్పుడు అతను కూడా హీరోగా మారిపోయాడు. జానీ మాస్టర్ బర్త్ డే సందర్భంగా నిన్న ఆయన హీరోగా నటిస్తున్న రెండు చిత్రాలను ప్రకటించారు. అందులో ఒకటి “జే1”. ఈ సినిమాకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇది జానీ మాస్టర్ తొలి చిత్రం. రెండవ చిత్రం… జానీ మాస్టర్ హీరోగా ఓషో తులసీరామ్ దర్శకత్వంలో వహిస్తున్న మూవీ ‘దక్షిణ’. అయితే జానీ ప్రస్తుతం చెన్నైలో ఉన్నాడు. తలపతి విజయ్, పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా నటిస్తున్న “బీస్ట్” మూవీ సాంగ్ షూట్ లో బిజీగా ఉన్నాడు. కాగా నిన్న జానీ మాస్టర్ పుట్టినరోజు కావడంతో యూనిట్, విజయ్ స్వయంగా జానీకి ఒక సర్ప్రైజ్ ఇచ్చారు. సెట్లో ఆయన బర్త్ డే సెలబ్రేషన్ నిర్వహించి జానీని ఆశ్చర్యపరిచారు. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
Read Also : నిర్మాతలతో పాటు ధనుష్ ను కలిసిన శేఖర్ కమ్ముల
Also Read
- Gandhari: తాప్సీ ‘గాంధారి’కి విడుదలకు ముందే షాక్.. కాపీ ఆరోపణలతో ముదిరిన వివాదం!
- Rajni Autobiography : ఆత్మకథ రాస్తున్న రజనీ.. సినిమాగా తీస్తే అదొక అద్భుతమే
- KA Productions: కిరణ్ అబ్బవరం బ్యానర్లో మరో డిఫరెంట్ మూవీ.. గూస్బంప్స్ తెప్పిస్తున్న మిస్టరీ పోస్టర్!
- Irumudi Movie Controversy : 'ఇరుముడి' సినిమాపై వివాదం.. ఆ సీన్లు తొలగించాలని డిమాండ్
మాస్ పాటలు, మెలోడీలు… ఈ ఏ సాంగ్స్ అయినా జానీ కొరియోగ్రఫీ చేస్తే విజిల్స్ వేయాల్సిందే. ‘ఖైదీ నంబర్ 150’లో ‘సుందరి…’, ‘రంగస్థలం’లో ‘జిల్ జిల్ జిగేలు రాణి’, ‘అల వైకుంఠపురములో’ చిత్రంలో ‘బుట్టబొమ్మ…’, ‘ఇస్మార్ట్ శంకర్’లో టైటిల్ సాంగ్, ‘రెడ్’లో ‘డించక్… డించక్’, ‘భీష్మ’లో ‘వాట్టే వాట్టే బ్యూటీ’, ధనుష్ చిత్రం ‘మారి-2’ లో ‘రౌడీ బేబీ’ పాటలకు ఆయనే కొరియోగ్రఫీ అందించారు. ఇటీవల ‘రాధే’లో ‘సిటీమార్…’ పాటతో సల్మాన్ అభిమానులు, ఉత్తరాది ప్రేక్షకులతో స్టెప్పులు వేయించారు. అలాగే పలు తెలుగు, తమిళ , కన్నడ స్టార్ హీరోల చిత్రాలకు కొరియోగ్రఫీ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Gandhari: తాప్సీ ‘గాంధారి’కి విడుదలకు ముందే షాక్.. కాపీ ఆరోపణలతో ముదిరిన వివాదం!
-
Rajni Autobiography : ఆత్మకథ రాస్తున్న రజనీ.. సినిమాగా తీస్తే అదొక అద్భుతమే
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
Strait of Hormuz: హోర్ముజ్‌పై ఇరాన్ కొత్త ప్లాన్.. ప్రపంచ దేశాలకు బిగ్ షాక్..
-
KA Productions: కిరణ్ అబ్బవరం బ్యానర్లో మరో డిఫరెంట్ మూవీ.. గూస్బంప్స్ తెప్పిస్తున్న మిస్టరీ పోస్టర్!
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్‌ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!