Site icon NTV Telugu

Janhvi Kapoor : మీ కెరీర్‌కు టాలీవుడ్ ఏ కరెక్ట్.. జాన్వీ‌పై తెలుగు డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్

Jhanvi Kapoor

Jhanvi Kapoor

జాన్వీ కపూర్ కెరీర్ విషయంలో టాలీవుడ్‌నే కరెక్ట్ ప్లేస్ అని తెలుగు దర్శకుడు అశోక్ తేజ చేసిన కామెంట్స్ ఇప్పుడు పెద్ద చర్చ గా మారాయి. బాలీవుడ్‌లో వరుసగా ఫ్లాప్‌లు తగులడంతో, ‘పరం సుందరి’, ‘సన్నీ సంస్కారి కి తులసి కుమారి’ వంటి సినిమాలు కూడా పని చేయకపోవడంతో జాన్వీకి కెరీర్‌కు దెబ్బ పడింది. రష్మిక, కియారా లాంటి రేంజ్‌కు వెళ్లాలంటే బ్లాక్‌బస్టర్లు అవసరం, కానీ హిందీలో ఆ అవకాశం రావడం లేదు. ఈ నేపథ్యంలో జాన్వీ ఇప్పుడు ఎక్కువగా తెలుగు సినిమాలకే మొగ్గు చూపుతున్నట్టు కనిపిస్తుంది. ఇదే విషయంపై ‘ఓదెలా 2’ ఫేమ్ అశోక్ తేజ మాట్లాడుతూ..

Also Read : Kaantha : ‘కాంత’కి ఆడియన్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్ ఆనందాన్ని ఇచ్చింది : రానా దగ్గుబాటి

‘హిందీ కంటే తెలుగు లోనే జాన్వీకి క్రేజ్ ఎక్కువ, శ్రీదేవి వారసురాలు కావడం వల్ల టాలీవుడ్ ప్రేక్షకులు ఆమెను ప్రేమగా అంగీకరిస్తారు, అందుకే ఇక్కడే కొనసాగడం మంచిది’ అని సలహా ఇచ్చారు. కానీ కొందరు మాత్రం దర్శకుడి మాటలు హద్దులు దాటాయని, ఒక హీరోయిన్ ఏ ఇండస్ట్రీలో పని చేయాలన్నది ఆమె నిర్ణయం అని కౌంటర్ చేస్తున్నారు. కానీ మరో వైపు చూసుకుంటే, తెలుగు రాష్ట్రాల్లో శ్రీదేవి ఫ్యాన్ బేస్ ఇప్పటికీ భారీగానే ఉంది. ఆమె కోసం ఏర్పడిన ఫ్యాన్ క్లబ్బులు కూడా ఇప్పటికీ యాక్టివ్‌గా ఉంటాయి. అదే ప్రేమ జాన్వీ నిలుపుకుంటే ఇక్కడ జాన్వీ చేస్తే చిన్న సినిమా అయినా తనకు మంచి క్రేజ్ వస్తుంది.

బాలీవుడ్‌కి తిరిగి వెళ్లిన అక్కడ ఇప్పటికే స్టార్ కిడ్స్ మధ్య పోటీ ఎక్కువగా ఉంది, ఆమెను ప్రత్యేకంగా చూడడం కష్టం. అందుకే జాన్వీకి టాలీవుడ్ మంచి మద్దతు వచ్చే అవకాశం ఉంది. ప్రజంట్ తెలుగులో జాన్వీ  ‘దేవర’ ‘పెద్ది’ రెండూ పెద్ద సినిమాలో నటిస్తోంది. ఇవి హిట్ అయితే జాన్వీకి టాలీవుడ్‌లో సాలిడ్ బూస్ట్ లభించినట్లే. అలా అయిన ఈ అమ్మడు డైరెక్టర్ అశోక్ తేజ ఇచ్చిన సలహా తీసుకుంటే దేమో చూడాలి.

Exit mobile version