NTV Telugu Site icon

Bollywood Actress : బాలీవుడ్ భామకు టాలీవుడ్ లో వరుస ఆఫర్లు..ఇంతకీ ఎవరు..?

Untitled Design (7)

Untitled Design (7)

అతిలోక సుందరి శ్రీదేవి కూతురుగా సినీ ఇండస్ట్రీకి పరిచయమయింది జాన్వీ కపూర్. తొలి చిత్రం ధఢక్ సూపర్ హిట్ కావడంతో వరుస ఆఫర్లు తలుపు తట్టాయి. తనదైన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని పలు హిట్ చిత్రాల్లో నటించించి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. కాగా జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న చిత్రం ‘దేవర’. మొదటి సినిమాతోనే స్టార్ హీరో jr.ఎన్టీయార్ సరసన ఛాన్స్ కొట్టింది. దేవర చిత్రం పాన్ ఇండియన్ భాషలలో రాబోతోంది. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ ఫస్ట్ లుక్ కు విశేష స్పందన లభించింది.  ఈ భామకు తెలుగులో వరుస ఆఫర్లు వస్తున్న కూడా సెలెక్టీవ్ గా వెళ్తుంది.

తాజాగా జాన్వీ కపూర్ మరో తెలుగు సినిమాకు సైన్ చేసింది. న్యాచురల్ స్టార్ నాని హీరోగా, శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంలో వచ్చిన దసరా సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. నాని తన నటనతో ప్రేక్షకులను కట్టి పడేసాడు. ఏడాది గ్యాప్ తర్వాత ఆ చిత్రానికి కొనసాగింపుగా దసరా -2 ను తెరకెక్కించబోతున్నాడు దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల. అందులో భాగంగా నాని సరసన హీరోయిన్ గా బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ ను ఎంపిక చేశారు. ఇటివల దర్శకుడు శ్రీకాంత్ జాన్వికి కథ వినిపించగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తోంది. దీనిపై అధికారక ప్రకటన త్వరలోనే రానుంది. కాగా దసరా-2 కు సికింద్రాబాద్ కథా నేపధ్యాన్ని ఎంచుకున్నాడు డైరెక్టర్. ఇందుకోసం సారథి స్టూడియోలో భారీ సెట్లు వేయబోతున్నారు. నాని కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో రాబోతున్న ఈ చిత్రాన్ని నిర్మాత చెరుకూరి సుధాకర్ నిర్మించనున్నారు.

Show comments