Site icon NTV Telugu

Janvi Ghattamaneni: హీరోయిన్ అవకుండానే యాడ్.. లక్షణంగా ఉంది బాసూ

Janvi

Janvi

త్వరలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్న జాన్వీ ఘట్టమనేని, ఇప్పుడు ఇంకా హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వకుండానే ఒక జువెలరీ యాడ్‌లో కనిపించనుంది. కౌశిక్ గోల్డ్ & డైమండ్స్ యాడ్‌లో జాన్వీ స్వరూప్ ఘట్టమనేని నటించారు. తెరపై ఆమె నటించిన తొలి ప్రచార చిత్రం ఇదే కావడం విశేషం.నటి, దర్శకురాలు మంజుల ఘట్టమనేని కుమార్తెగా, లెజెండరీ సూపర్ స్టార్ కృష్ణ మనవరాలిగా, జాన్వీ ఒక కొత్త తరంగా మన ముందుకు వస్తుంది.

బ్రాండ్ టీం, జాన్వీ ఫోటోలను సోషల్ మీడియాలో చూసి ఆమెను అప్రోచ్ అయినట్టు తెలుస్తోంది. ఈ మధ్యనే జాన్వీ పుట్టినరోజు సందర్భంగా, ఆమె హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు అధికారిక ప్రకటన చేశారు. ఇక హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వకముందే, ఆమెతో ఒక బ్రాండ్ యాడ్ చేయించడం ఆసక్తికరమైన విషయం అని చెప్పాలి. త్వరలోనే ఆమె ఒక బడా ప్రాజెక్టులో భాగం కాబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఆమెను లాక్ చేశారని, త్వరలోనే దానికి సంబంధించిన అధికారిక ప్రకటన ఉండే అవకాశం ఉందని అంటున్నారు.

Exit mobile version