NTV Telugu Site icon

Janasena: షాకింగ్: జానీ మాస్టర్ కు జనసేన కీలక ఆదేశాలు!

Jani Master Pawan Kalyan

Jani Master Pawan Kalyan

Janasena Suspends Jani Master with Immediate Effect: ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ మీద ఒక లేడీ కొరియోగ్రాఫర్ రేప్ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. తనను పలు సందర్భాలలో పలు ప్రాంతాలలో రేప్ చేశాడని తర్వాత మతం మార్చుకుని పెళ్లి చేసుకోవాలని వేధించాడని సదరు యువతి ఫిర్యాదులో పేర్కొంది. ఆ యువతి ఫిర్యాదు మేరకు హైదరాబాద్ నార్సింగి పోలీసులు జానీ మాస్టర్ మీద కేసు నమోదు చేశారు. ఆయన కోసం గాలిస్తున్నారు ప్రస్తుతానికి ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందని తెలుస్తోంది.

Chiranjeevi: తెలంగాణ సీఎంఆర్ఎఫ్ కి చిరు సహా పలువురి విరాళాలు.. ఎవరెవరంటే?

ఇక గత ఎన్నికల ముందు జానీ మాస్టర్ జనసేనలో జాయిన్ అయ్యి ప్రచార బాధ్యతలు కూడా చేపట్టారు. ఏపీ మొత్తం ప్రచారం ఆయనే చూసుకున్నారు. ఆయనకు ప్రచార కమిటీ పదవి కూడా లభించింది. ఇక ఇప్పుడు ఈ రేప్ కేసు నేపథ్యంలో జనసేన పార్టీ ఒక సంచలన ప్రకటన చేసింది. జనసేన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని శ్రీ షేక్ జానీని ఆదేశించడమైనది. ఆయనపై రాయదుర్గం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన క్రమంలో పార్టీ నాయకత్వం ఈ నిర్ణయం తీసుకొంది. తక్షణమే ఈ నిర్ణయం అమలులోకి వస్తుంది అంటూ కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ జనసేన పార్టీ హెడ్ వేములపాటి అజయ్ కుమార్ పేర్కొన్నారు.

Show comments