JanaNayagan : జననాయగన్ మరోసారి సెన్సార్.. అదనంగా మరో 41 సెకండ్స్

Jananayagan Re Censor

Jananayagan Re Censor

కోలీవుడ్ స్టార్ హీరో ప్రస్తుత తమిళనాడు ముఖ్యమంత్రి దళపతి విజయ్ నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ జననాయగన్‘. విజయ్ ఆఖరి చిత్రం కావడంతో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. సెన్సార్ బోర్డుతో సుదీర్ఘ పోరాటం తర్వాత ఎట్టకేలకు ఈ చిత్రం జూలై 24న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కావడానికి సిద్ధమైంది. ఈ నేపథ్యంలో సినిమా రన్‌టైమ్‌కు సంబంధించి ఒక క్రేజీ అప్‌డేట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

తాజా సమాచారం ప్రకారం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ఈ చిత్రానికి రీసెన్సార్ నిర్వహించారు. అయితే ఈ ప్రాసెస్ లో సినిమాకు అదనంగా 41 సెకన్ల ఫుటేజ్‌ను జోడించినట్లు తెలుస్తోంది. ఈ లేటెస్ట్ యాడింగ్‌తో ‘జననాయగన్’ ఫైనల్ రన్‌టైమ్ ఇప్పుడు 3 గంటల 3 నిమిషాల 52 సెకన్లగా లాక్ చేసారు. ఈ 41 సెకన్ల అదనపు సీన్ ఏమై ఉంటుందా అని నెటిజన్లు, విజయ్ ఫ్యాన్స్ రకరకాల అంచనాలు వేస్తున్నారు. సోషల్ మీడియాలో వినిపిస్తున్న టాక్ ప్రకారం విజయ్ ఇటీవల రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి, సీఎం పీఠాన్ని అధిరోహించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో “తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్” అంటూ సరికొత్తగా డిజైన్ చేసిన పొలిటికల్ టైటిల్ కార్డ్ లేదా ఫ్యాన్స్‌కు ఇచ్చే పవర్‌ఫుల్ మెసేజ్ వీడియోను ఈ 41 సెకన్లలో యాడ్ చేసి ఉంటారనే ప్రచారం గట్టిగా సాగుతోంది. ఈ సినిమాలో లోకేష్ కనకరాజ్, అట్లీ లేదా నెల్సన్ వంటి స్టార్ డైరెక్టర్లు గెస్ట్ రోల్స్‌లో కనిపించబోతున్నారనే రూమర్స్ ఉన్నాయి. ఆ సర్ప్రైజ్ క్యామియోకు సంబంధించిన ఎక్స్‌టెండెడ్ షాట్ ఇదైనా అయ్యుండాలి. హెచ్. వినోద్ దర్శకత్వంలో, KVN ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ ‘జననాయగన్’ జూలై 24న థియేటర్లలోకి రాబోతోంది.