Site icon NTV Telugu

Piracy : పైరసీ చేసి 50 లక్షలు సంపాదించిన కిరణ్ ..ప్రైవేటు వీడియోలు కూడా ?

Piracy News

Piracy News

కొత్త సినిమా విడుదలైందా?..
అయితే మీరు వెంటనే థియేటర్ కెళ్ళి చూడకండి..
కొన్ని గంటల్లో సినిమా మీ ఇంట్లోకే వచ్చి చేరుతుంది..
అదేంటి అనుకుంటున్నారా.. అవును నేను చెప్తుంది నిజమే. ఎందుకంటే కోట్ల రూపాయలు పెట్టి తీసిన సినిమా కొన్ని గంటల్లోనే మన నెట్టింట్లో వైరల్ అవుతుంది ..అంతేకాదు ఫ్రీగా ఎలాంటి డబ్బులు లేకుండా హెచ్డి క్వాలిటీలో సినిమా చూడొచ్చు.. ఎంజాయ్ చేయవచ్చు..

Also Read:Fake Casting Alert: మా పేరు చెప్పుకుని హీరోయిన్స్ కు ఫ్రాడ్ ఆఫర్‌లు .. యూవీ సంస్థ కీలక ప్రకటన

గత ఏడాది కాలంలో ఏకంగా 3700 కోట్ల రూపాయల వరకు సినిమా పరిశ్రమ నష్టపోయింది.. టాలీవుడ్ లో తీసిన పెద్ద పెద్ద సినిమాలు అన్ని కూడా విడుదలైన కొన్ని గంటల్లోనే పైరసీ ప్రత్యక్షమైంది ..అయితే దీన్ని కట్టడి చేసేందుకు సినీ పరిశ్రమతో పాటు పోలీసులు తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేశారు.. కానీ ఇప్పటివరకు అసలైన నిందితుని పట్టుకోలేకపోయారు . అసలైన నిందితుడు ఇప్పుడు పోలీసులకు చిక్కాడు.. అంతేకాదు ఏడాది కాలంలో 40 పైగా సినిమాలు పైరేట్స్ చేశాడు.. ఇటీవల విడుదలైన కన్నప్ప దగ్గర నుంచి గత ఏడాది విడుదలైన పెద్ద పెద్ద సినిమాలు సైతం పైరసీ చేశాడు.. అయితే ఇది మొత్తం కూడా హెచ్ డి క్వాలిటీలో పైరసీ చేశారని అధికారులు చెప్తున్నారు. దాదాపు సినీ పరిశ్రమకు 3,700 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది.. ఏడాది కాలంలో 40 కి పైగా సినిమాలను ఈ ప్రబుద్ధుడు పైరసీ చేశాడు.. పైరసీ గుట్టు మొత్తం ఏకంగా హైదరాబాద్ నుంచి నడిచిందని అధికారుల విచారణలో బయట పడింది.. ఒక ఏసీ టెక్నీషియన్ ఈ వ్యవహారం మొత్తం నడిపాడని అధికారులు అంటున్నారు.. అంతేకాదు ఈ ఏసీ టెక్నీషియన్ నేరుగా తమిళ వెబ్సైట్లతో కాంటాక్ట్ పెట్టుకున్నాడు ..అక్కడి నుంచి ఆ సినిమాలని అప్లోడ్ చేయించడం మొదలు పెట్టాడు.. తాను సినిమా థియేటర్లోకి వెళ్లిపోయి అక్కడ దొంగచాటుగా హెచ్ డి క్వాలిటీలో వీడియో తీసాడు.. ప్రత్యేకమైన ఒక యాప్ ద్వారా సినిమా మొత్తాన్ని రికార్డు చేసేవాడు.. ఆ రికార్డు చేసిన సినిమా అని ఏకంగా పోటాన్ అనే లింకు ద్వారా తమిళ వెబ్సైట్లోకి పంపేవాడు ..ఇప్పటివరకు ఈ సినిమాలు అన్నీ కూడా ఒక మాల్ నుంచి చేసినట్లు అధికారులు తెలిపారు..

Also Read:Bhairavam: ఓటీటీలోకి ‘భైరవం’.. ఎక్కడ చూడాలంటే?

ఏసీ టెక్నీషియన్ గా పనిచేస్తున్న జాన కిరణ్ కుమార్.. ఇతనిది ఈస్ట్ గోదావరి జిల్లా ఎనిమిది సంవత్సరాల క్రితం తల్లితో కలిసి హైదరాబాద్ కి వచ్చాడు.. హైదరాబాద్ లో ఏసీ టెక్నీషియన్ గా పనిచేస్తున్నాడు.. బోరబండలో ఏసీ కంపెనీలో అతను వర్క్ చేస్తుంటాడు.. అయితే అతను ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే దీనికి తోడు అనారోగ్య కారణాలు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో కొత్త ఉద్యోగం కోసం వెతుకుతుంటే తమిళ్ ఎంవి అనే వెబ్సైటు కనపడింది.. పార్ట్ టైం ఉద్యోగం ఇస్తామని చెప్పింది.. దీంతో సదరు వెబ్సైట్ కి కాంటాక్ట్ చేశాడు.. ఆ వెబ్సైట్ తమకు వీడియోలు అప్లోడ్ చేస్తే డబ్బులు ఇస్తామని తెలిపారు.. ఎలాంటి వీడియోలు కావాలని అడిగినప్పుడు.. సినిమాతో పాటు హైదరాబాద్ సంబంధించిన వీడియోలు అప్లోడ్ చేస్తే పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లిస్తామని పేర్కొన్నారు.. ముందు కొన్ని ప్రైవేటు వీడియోలు ఇవ్వడం జరిగింది ..ఆ తర్వాత అదే తమిళ కంపెనీ నేరుగా సినిమా టికెట్లు బుక్ చేసి వీడియో ఎలా రికార్డ్ చేయాలో చెప్పింది.. సినిమా ధియేటర్లో పై నుంచి మొదటి రోలో సీట్ ని బుక్ చేసుకునేవాడు.. సినిమా విడుదలైన మొదటి రోజే మొదటి షో కి వెళ్లేవాడు..

పాప్కాన్ లేదా ఏదైనా బ్యాగ్ లేదంటే జేబులో సెల్ ఫోన్ పెట్టుకుని సినిమా మొత్తాన్ని హెచ్డి క్వాలిటీలో రికార్డ్ చేసేవాడు..స్టాండ్ బై అనే ఆప్ ద్వారా దీనిని రికార్డు చేసేవాడు.. అలా రికార్డు చేసిన వీడియో మొత్తాన్ని లింకు ద్వారా తమిళ కంపెనీలకు పంపించేవాడు. సినిమాని హెచ్డీ క్వాలిటీ తో పాటు ఆడియోని మిక్స్ అప్ చేసి తమిళ వెబ్సైట్ల అప్లోడ్ చేసేవారు.. ఒక్కొక్క సినిమాకి 30 వేల నుంచి లక్ష రూపాయల వరకు కిరణ్ కుమార్ కి వెబ్సైట్లు చెల్లించాయి.. ఇలా ఇప్పటివరకు 50 లక్షల రూపాయల వరకు కిరణ్ సంపాదించారని అధికారులు చెబుతున్నారు. తమిళ వెబ్సైట్లో మొత్తం కూడా డైరెక్ట్ గా డబ్బులు చెల్లించేవారు కాదు. ..వీళ్ళు అమెరికా డాలర్స్, క్రిప్టో కరెన్సీ ,బిట్ కాయిన్స్ రూపంలో డబ్బులు కిరణ్ కుమార్ కు ఇచ్చేవారు.. వాటిని మన దేశ కరెన్సీలోకి కిరణ్ కుమార్ మార్చుకునేవాడు.. కిరణ్ కుమార్ సెల్ ఫోన్ చెక్ చేసినప్పుడు 40 కి పైగా సినిమాలు పైరసీ చేసినట్లు బయటపడింది ..అయితే గత నాలుగు సంవత్సరాల నుంచి కిరణ్ కుమార్ సినిమాలను పైరేట్ చేసి తమిళ వెబ్సైట్లకు అమ్మి వేస్తున్నాడని అధికారులు చెప్పారు. తెలుగు, తమిళ, హిందీ సినిమాలను పైరసీ చేసి అమ్ముతున్న కిరణ్ కుమార్ ని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు పంపించారు. .అయితే తమిళ వెబ్సైట్లను ప్రతినిధులను కూడా పట్టుకుంటామని అధికారులు చెబుతున్నారు..

Exit mobile version