Jailer 2 Telugu Trailer: బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ‘జైలర్’ తర్వాత, భారీ అంచనాల నడుమ సీక్వెల్ ‘జైలర్ 2’ తెలుగు ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై డైరెక్టర్ నెల్సన్ దిలీప్‌కుమార్ తెరకెక్కించిన ఈ ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగానే ట్రెండ్ అవుతోంది. సూపర్ స్టార్ రజనీకాంత్ మరోసారి ‘టైగర్ ముత్తువేల్ పాండియన్’గా స్క్రీన్‌పై అడుగుపెట్టి తనదైన స్టైల్, స్వాగ్‌తో కనిపించారు. పార్ట్-1లో విలన్ వర్మన్‌ను అంతం చేసిన తర్వాత ముత్తువేల్ పాండియన్ ఎక్కడికీ పారిపోలేదని, అతడిని పట్టుకోవడం ఎవరి వల్లా కావడం లేదనే డైలాగ్స్‌తో ట్రైలర్ మొదలవుతుంది. “అసలు ఎవడతను? అతడి వెనుక ఇంకెవరున్నారు?” అంటూ విలన్ గ్యాంగ్స్ భయపడే సీన్లు, నెల్సన్ మార్క్ డార్క్ హ్యూమర్ షాట్లు కొన్ని చోట్ల ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా.. “శత్రువులందరినీ ఒకే గూటికి పిలిచి.. ఒకేసారి బాంబుతో లేపేయడమే ఇప్పటి ట్రెండ్” అనే డైలాగ్ రజనీ మార్క్ స్వాగ్‌ను గుర్తుచేసింది. అనిరుధ్ రవిచందర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఎప్పటిలాగే కొన్ని ఫ్రేమ్స్‌ను నిలబెట్టే ప్రయత్నం చేసింది.
ట్రైలర్ చూడటానికి బాగానే ఉన్నా.. సగటు సినీ ప్రియుడికి మాత్రం ఏదో తెలియని అసంతృప్తి మిగిలిపోతోంది. ‘జైలర్’ ఫస్ట్ పార్ట్ ఇచ్చిన అడ్రినలిన్ రష్, గూస్‌బంప్స్ మూమెంట్స్‌తో పోలిస్తే ఈ సీక్వెల్ ట్రైలర్ ఆ స్థాయి కిక్ ఇవ్వలేకపోయిందనే ఫీలింగ్ కలుగుతోంది. ఫస్ట్ పార్ట్‌లో శివరాజ్‌కుమార్, మోహన్‌లాల్ వంటి ఇతర ఇండస్ట్రీల దిగ్గజాల క్యామియోలు, ఇంటర్వెల్ బ్యాంగ్ ఇచ్చిన ఇంపాక్ట్ నెక్స్ట్ లెవెల్‌లో ఉండింది. కానీ ‘జైలర్ 2’ ట్రైలర్‌ను గమనిస్తే రొటీన్ రివేంజ్ డ్రామా, కాస్త డార్క్ కామెడీ మిక్స్ చేసి లాగించేసినట్లు కనిపిస్తోందే తప్ప.. ఫస్ట్ పార్ట్‌లో చూపించిన ఫ్రెష్‌నెస్ ఇందులో కనిపించలేదనే ఫీలింగ్ కలిగిస్తుంది. సూపర్ స్టార్ స్వాగ్ ఉన్నప్పటికీ.. కంటెంట్‌లో స్టార్ కాస్ట్ కనిపించిన మెరుపులేవీ అనిపించలేదు. మరి ఈ ట్రైలర్ కలిగించిన వెలితిని పక్కనపెట్టి, సినిమాలో నెల్సన్ ఇంకేమైనా సర్ ప్రైజ్‌లు దాచిపెట్టి బాక్సాఫీస్ వద్ద మేజిక్ చేస్తారేమో చూడాలి.

