Jai Balayya Dialouge in Buddy Movie got Huge Response: అల్లు శిరీష్ హీరోగా బడ్డీ అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన టెడ్డీ అనే సినిమాకి దీన్ని రీమేక్ అని ముందు నుంచి ప్రచారం జరిగింది. కానీ కథలో కొన్ని మార్పులు చేర్పులు చేసి ప్రేక్షకులు ముందుకు తీసుకొచ్చారు. ఇక ఈ సినిమాకి మిశ్రమ స్పందన లభిస్తుంది. ఆల్రెడీ చూసేసిన సినిమానే మళ్లీ చూపించారని కొందరు అంటుంటే లాజిక్ లెస్ గా అనిపించిందని కొందరు అంటున్నారు. ఆ సంగతి పక్కన పెడితే ఈ సినిమా విషయంలో కొన్ని సీన్లు మాత్రం గట్టిగా పేలాయి.
Janhvi Kapoor: జీవితంలో ఆ పని అస్సలు చేయొద్దంది.. జాన్వీ సంచలన వ్యాఖ్యలు
ముఖ్యంగా తెలుగు సినిమాలను అనుసరిస్తూ కొన్ని సీన్లు చేశారు అవి బాగా పేలాయి. ఇక ఒక మెషిన్ గన్ వాడుతున్న సమయంలో నందమూరి బాలకృష్ణ పేరు తలుచుకుంటూ మూసేసి ప్రతి పబ్ ముందు వినబడే ఏకైక పాట జై బాలయ్య అంటూ టెడ్డీబేర్ తోటి మెషిన్ గన్ ఆపరేట్ చేయించిన విధానం ఆకట్టుకునేలా ఉంది. ముఖ్యంగా ఆ సీన్ పడినప్పుడైతే థియేటర్లో మంచి రెస్పాన్స్ లభించింది. అల్లు హీరో సినిమాలో జై బాలయ్య డైలాగులు అదిరిపోయాయంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ ప్రిషా సింగ్ హీరోయిన్లుగా శ్యామ్ ఆంటోనీ డైరెక్ట్ చేశాడు. స్టూడియో గ్రీన్ బ్యానర్ మీద జ్ఞానవేల్ రాజా నిర్మించిన. ఈ సినిమా రెండో తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది.