Site icon NTV Telugu

Jagapathi Babu: అనుష్క స్వీటీ కానీ ఈ సినిమాలో మాత్రం చాలా ఘాటు!!

Jagapathi Babu

Jagapathi Babu

అనుష్క శెట్టి మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ డ్రామా ఘాటి. విక్రమ్ ప్రభు మేల్ లీడ్ గా నటించిన ఈ చిత్రానికి విజనరీ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు. UV క్రియేషన్స్ సమర్పణలో ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి నిర్మించారు. ఇప్పటికే అద్భుతమైన ప్రమోషనల్ కంటెంట్ తో సినిమా హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. సెప్టెంబర్ 5న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ నేపధ్యంలో మేకర్స్ ప్రెస్ మీట్ నిర్వహించారు.

Also Read : The Paradise: ‘ది ప్యారడైజ్’ కోసం హాలీవుడ్ కొలాబరేషన్

ఈ క్రమంలో యాక్టర్ జగపతిబాబు మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. అనుష్క స్వీటీ అని మనందరికీ తెలుసు కానీ. ఈ సినిమాల్లో చాలా ఘాటుగా ఉండబోతుంది. అన్ని రియల్ లొకేషన్స్ లో చేసిన సినిమా ఇది. ఒకసారి ప్రయాణిస్తున్న కారు బురదలో ఇరుక్కుపోయింది. దాదాపు ఒక 40 నిమిషాలకు రోడ్డు మీదే నిలిచి ఉండిపోయాం. అలాంటి లోకేషన్స్ లో చేశాం. ఈ సినిమా జర్నీ అంత చాలా ఎంజాయ్ చేసాం. ఈ ప్రెస్ మీట్ కి రావడానికి ప్రధాన కారణం క్రిష్ గారు రాజీవ్. చాలా అద్భుతమైన సినిమా తీశారు. ఈ సినిమా గురించి చెప్పాలని వచ్చాను. ఈ సినిమాలో నేను పోలీస్ క్యారెక్టర్ చేస్తున్నాను. చాలా డిఫరెంట్ క్యారెక్టర్. మంచి చేస్తానా చెడు చేస్తానా ఏం చేస్తానో నాకే తెలియని క్యారెక్టర్. డైరెక్టర్ క్రిష్ గారు చాలా అద్భుతంగా రాశారు. నేను క్రిష్ ఎప్పటినుంచో మంచి ఫ్రెండ్స్. ఫైనల్ గా ఈ సినిమాతో కలిసి వర్క్ చేసాం. చాలా ఎంజాయ్ చేస్తూ చేసిన సినిమా ఇది. రాజీవ్ నిజాయితీ ఉన్న ప్రొడ్యూసర్. తన మాటంటే మాటే. ఈ సినిమా రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్.

Exit mobile version