స్నేహం, అందమైన ప్రేమ పేరుతో మొదలైన కాలేజీ కుర్రాళ్ల కథ అనుకోకుండా ఓ భయంకరమైన క్రైమ్ డ్రామాగా మారితే ఎలా ఉంటుంది? సరిగ్గా ఇదే పాయింట్‌తో ఒడియా బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించి, బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన చిత్రం ‘జడి’ (The Untold Side of IF). ఇప్పుడు ఈ రస్టిక్ కామెడీ క్రైమ్ డ్రామాను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. మెగా ప్రొడక్షన్స్ అధినేత ఉడుగుల అశ్విని కుమార్ గౌడ్ ఈ చిత్రాన్ని తెలుగులో అత్యంత ప్రతిష్టాత్మకంగా సమర్పిస్తున్నారు. శ్రీయాన్ష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కాజల్ రే నిర్మించిన ఈ చిత్రానికి దిబ్య జ్యోతి ఉదయ సింగ్ రచన, దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సినిమాపై అంచనాలను పెంచుతూ మేకర్స్ కళ్లు చెదిరే తెలుగు గ్లింప్స్‌ను విడుదల చేశారు. పక్కా గ్రామీణ వాతావరణంలో, మట్టి వాసన ఉట్టిపడేలా తెరకెక్కిన ఈ కథలో.. ప్రాణానికి ప్రాణమిచ్చే స్నేహితుల మధ్య తలెత్తే కఠోరమైన సంఘర్షణలను, విభేదాలను చూపించిన విధానం గూస్బంప్స్ తెప్పిస్తోంది. కేవలం ఒక రొటీన్ ప్రేమకథగా కాకుండా, స్నేహితులు శత్రువులుగా మారే క్రమాన్ని, మనిషిలోని విభిన్న భావోద్వేగాలను దర్శకుడు ఈ గ్లింప్స్‌లో సెన్సేషనల్‌గా ఆవిష్కరించారు.
సైలేంద్ర సమంతరాయ్, ప్రియంబద స్వైన్, ఆకాశ్ హోతా ప్రధాన పాత్రల్లో అద్భుతమైన నటనను కనబరిచారు. సుశాంత్ దాస్ మహాపాత్ర, రబి మిశ్రా, బాలకృష్ణ నాయక్, కృష్ణ రౌత్ వంటి సీనియర్ తారాగణం కీలక పాత్రలు పోషించారు. సాంకేతికంగా కూడా ఈ చిత్రం అద్భుతంగా రూపొందింది. రుద్రకాంత సింగ్ కెమెరా పనితనం పల్లెటూరి అందాలను కళ్లకు కట్టగా.. అభిషేక్ పనిగ్రాహి ఇచ్చిన ఇంటెన్స్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సోమేశ్ సత్పతి సంగీతం సినిమాకు ప్రాణం పోశాయి. ఇక తెలుగు వెర్షన్‌కు ప్రముఖ రచయిత రాకేందు మౌళి మాటలు, పాటలు అందించడం బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. మన నేటివిటీకి ఏమాత్రం తగ్గకుండా ఆయన రాసిన డైలాగ్స్ ఈ క్రైమ్ డ్రామాకు మరింత బలాన్ని చేకూర్చాయి. గ్లింప్స్‌తోనే తెలుగు ఆడియన్స్‌లో భారీ బజ్ క్రియేట్ చేసిన ‘జడి’ చిత్ర బృందం, అతి త్వరలోనే థియేట్రికల్ రిలీజ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించనుంది.

