Site icon NTV Telugu

Samantha: ఇలా ఉండటం చాలా కష్టంగా ఉంది : సమంత

February 7 2025 02 20t140344.453

February 7 2025 02 20t140344.453

జీవితంలో మనం తీసుకున్న కొన్ని నిర్ణయాలు కష్టంగా ఉన్న భరించాలి. ఎందుకంటే ఎలాంటి బంధం అయిన భరించేలా ఉండకూడదు. అలా ఉంటే అది బంధం  అనిపించుకోదు. ముఖ్యంగా భార్య భర్తల బంధం అనేది ఒక ఎమోషన్. అది ఎంత బలంగా ఉంటే.. జీవితం అంత అందంగా ఉంటుంది. అందులో చిన్న లోపం ఉన్న రెండు జీవితాలు నరకంగా ఉంటాయి. ప్రజంట్ సమంత కూడా ఇలాంటి నరకం గురించి తాజాగా ఒక పోస్ట్ పెట్టింది.

Also Read:Juice: ఏ జ్యుస్ తాగితే ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసా

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రజంట్ ఎలాంటి పరిస్థితిలో ఉందో మనకు తెలుసు. సినిమాలు తీస్తూ.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. ఎంత యాక్టివ్ గా ఉన్నప్పటికీ తనలో తాను చాలా ఎమోషనల్ పర్సన్ అని చెప్పాలి. అందుకే సామ్ ఎప్పుడు ఎక్కువగా బంధాలు, ఒంటరితనం ఈ రెండు టాపిక్‌లపైనే ఎక్కువ కామెంట్స్ చేస్తుంది..

ఇందులో భాగంగా తాజాగా ‘మనతో మనం ఒంటరిగా ఉండడం కష్టమైన విషయాల్లో ఒకటి. అది చాలా భయంకరంగా ఉంటుంది. కానీ, ఇలా మౌనంగా ఉండడాన్ని నేను ఇష్టపడతాను. అందరికీ దూరంగా, ఒంటరిగా, ఫోన్, సోషల్ మీడియా, షూటింగ్.. అన్నింటినీ పక్కన పెట్టి నాతో నేను మాత్రమే మిలియన్‌ సార్లు గడిపాను’ అంటూ పోస్టులో వెల్లడించింది.  ప్రజంట్ ఈ పోస్ట్ వైరల్ అవుతుండటంతో. అభిమానులు ఒక్కొక్కరు ఒక్కోలా రెస్పాండ్ అవుతున్నారు. ఇక సమ్ మూవీస్ విషయానికి వస్తే ఇటీవల సమంత ‘సిటడెల్: హనీ బన్నీ’ సిరీస్ తో వచ్చింది.. ఇది మంచి విజయం అందుకుంది. ప్రజంట్ ‘రక్త్ బ్రహ్మాండ్’ షూటింగ్ లో బిజీ బిజీగా గడుపుతుంది.

Exit mobile version