Site icon NTV Telugu

Itlu Mee Yedhava : మైత్రి – ప్రైమ్ షో.. ‘ఇట్లు మీ ఎదవ’

Itlu

Itlu

త్రినాధ్ కఠారి హీరోగా ఆయన స్వీయ దర్శకత్వంలో సంజీవని ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మాత బళ్లారి శంకర్ నిర్మిస్తున్న యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌ ఇట్లు మీ ఎదవ. సాహితీ అవాంచ హీరోయిన్ గా నటిస్తున్నారు. వెయ్యేళ్ళు ధర్మంగా వర్ధిల్లు అనేది ట్యాగ్ లైన్. ఈ సినిమా ట్రైలర్ మంచి రెస్పాన్స్ తో సినిమాపై అంచనాలు పెంచాయి. నవంబర్ 21న ఈ సినిమా విడుదల కానుంది. నైజాంలో ఈ చిత్రాన్ని మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ LLP విడుదల చేయనుండగా, ఆంధ్ర, సీడెడ్ లో ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ రిలీజ్ చేయనుంది. ఈ రెండు ప్రముఖ సంస్థల భాగస్వామ్యంతో సినిమా గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ చిత్రంలో తనికెళ్ల భరణి, గోపరాజు రమణ, దేవీ ప్రసాద్ కీలక పాత్రలు పోషించారు. R P పట్నాయక్ మ్యూజిక్ అందించిన ఈ చిత్రానికి జగదీష్ చీకటి డీవోపీ, ఎడిటర్ ఉద్ధవ్ SB.

Exit mobile version