Site icon NTV Telugu

Pawan Kalyan : మెగాస్టార్ గిన్నిస్ రికార్డ్ పై పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే..?

Untitled Design (1)

Untitled Design (1)

22 సెప్టెంబర్ 2024న భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అత్యంత సక్సెస్ ఫుల్ చలనచిత్ర నటుడిగా, డాన్సర్ గా మెగాస్టార్ చిరంజీవి కొణిదెలని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ గుర్తించింది. 1978 సెప్టెంబరు 22న మెగాస్టార్ చిత్ర పరిశ్రమకు అరంగేట్రం చేసారు. నేడు గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్స్ అవార్డు చేసిన రోజు కూడా సెప్టెంబర్ 22 కావడం చిరుకు ఎంతో ప్రత్యేకం.  మెగాస్టార్ చిరంజీవి 46 సంవత్సరాల కాలంలో అయన నటించిన  156 సినిమాల్లో 537 పాటల్లో 24000 డ్యాన్స్ మూవ్స్ చేశారు.  ఇందుకు గాను గిన్నీస్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కింది. హైదరాబాద్‌లో జరిగిన  ఈ కార్యక్రమంలో బాలీవుడ్‌ నటుడు అమిర్‌ఖాన్ చేతుల మీదుగా ఈ అవార్డును మెగాస్టార్ అందుకున్నారు. ఈ సందర్భంగా చిరు మాట్లాడుతూ.. ‘గిన్నిస్ రికార్డ్ నన్ను వరిస్తుందని నా కలలో కూడా ఊహించలేదు. నేను ఎదురుచూడని ఒక గొప్ప గౌరవం లభించినందుకు భగవంతునికి, దర్శక నిర్మాతలకు, అభిమానులకు రుణపడి ఉంటాను’ అని అన్నారు.

Also Read : Devara : తెలుగు ప్రేక్షకులకు ప్రేమతో.. మీ జాన్వీ కపూర్..

ఇదిలా ఉండగా అన్నయ్య పేరు గిన్నిస్ రికార్డుల్లో లిఖితం కావడంపై సంతోషం వ్యక్తం చేస్తూ ” అన్నయ్య చిరంజీవి గారికి సినీ ప్రపంచంలో రికార్డులు, విజయాలు కొత్త కాదు. ఈ రోజు అన్నయ్య గారి పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో లిఖితం కావడం ఎంతో ప్రత్యేకం. 156 చిత్రాలు,  537 పాటలు, 24 వేల స్టెప్స్ తో అలరించిన నటుడిగా చిరంజీవి గారి పేరు నమోదు కావడం ఎనలేని సంతోషాన్ని కలిగించింది. ‘ద మోస్ట్ ప్రొలిఫిక్ ఫిల్మ్ స్టార్ ఇన్ ఇండియన్ సినిమా’ అని గౌరవించడం ప్రతి ఒక్కరికీ ఆనందాన్నిస్తుంది. అన్నయ్య చిరంజీవి గారికి హృదయపూర్వక అభినందనలు తెలియచేస్తున్నాను” అని లేఖ విడుదల చేసారు తమ్ముడు పవన్ కళ్యాణ్.

Exit mobile version