సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన పుష్ప- 2 ది రూల్ డిసెంబర్లో రిలీజ్ అయ్యి ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. సినిమా రిలీజ్ అయి నెల రోజులు దాటుతున్న నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించిన సీన్స్ కొన్నింటిని యాడ్ చేసి పుష్ప రీలోడెడ్ అంటూ ఒక సినిమాని రిలీజ్ చేశారు. జనవరి 11వ తేదీన ముందుగా రిలీజ్ చేయాలనుకున్నారు కానీ పలు కారణాలతో వాయిదా వేసి ఈరోజు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.
Also Read : Naga Chaitanya : యేటలో చేపలు పట్టేసాక..మంచి పులుసు ఎట్టేయాలి కదా
ఇక ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ వెర్షన్ ప్రేక్షకులకు ఒక మంచి ఫీస్ట్ అని చెప్పాలి. ఎందుకంటే డిసెంబర్లో రిలీజ్ చేసినప్పుడు మిస్ అయ్యాయి అనుకుంటున్న కొన్ని ఎలిమెంట్స్ ఈ రీ లోడెడ్ లో లోడ్ చేసి పెట్టారు. ముఖ్యంగా సినిమా ఓపెనింగ్ లో ఉండే జపాన్ ఫైట్ పుష్పరాజు కల అని అందరూ అనుకున్నారు. కానీ సెకండ్ హాఫ్ లో దానికి ఒక సీక్వెన్స్ కలిపిన విధానం ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంది. నిజంగానే పుష్ప రాజు 42 రోజులపాటు జర్నీ చేసి జపాన్ వెళ్లిన తీరును ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చిన విధానం ఆకట్టుకునేలా ఉంది. సుకుమార్ మార్క్ ఇక్కడే చూపించారని ప్రేక్షకుల భావిస్తున్నారు. ఎందుకంటే అది కల అని దాదాపు అందరూ ఫిక్స్ అయిపోయిన తర్వాత దానికి ఒక లింక్ కలుపుతూ రిలీజ్ చేసిన విధానం ఇప్పుడు అందరి చేత మైండ్ బ్లోయింగ్ అనిపిస్తోంది.