NTV Telugu Site icon

‘ఇస్మార్ట్ శంకర్‌’ సరికొత్త రికార్డు

టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ వరుస అపజయాల అనంతరం ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో కమర్షియల్ హిట్ కొట్టాడు. హీరో రామ్ మాస్​ లుక్​లో కనిపించగా.. నభా నటేష్​, నిధి అగర్వాల్​ హీరోయిన్లుగా అలరించారు. అయితే టాలీవుడ్‌ ప్రేక్షకుల మాదిరే బాలీవుడ్‌ ప్రేక్షకుల నుంచి కూడా ఇస్మార్ట్‌ శంకర్‌కి నుంచి అనూహ్య స్పందన వస్తోంది. లాక్ డౌన్ లో మన హీరోల డబ్బింగ్ సినిమాలకు బాలీవుడ్ లోనూ వ్యూవ్స్ మిలియన్ల సంఖ్యలో వస్తున్నాయి. తాజాగా ‘ఇస్మార్ట్ శంకర్’ హిందీ వెర్షన్ యూట్యూబ్​ ఛానల్​లో 200 మిలియన్ల వ్యూవ్స్ అందుకొని సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఇక సౌత్‌ సినిమా నుంచి నాలుగు సినిమాలను 200 మిలియన్ల వ్యూస్‌కు చేర్చిన తొలి హీరోగా రామ్‌ ఈ ఘనత సాధించాడు.