పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు .ప్రభాస్ నటించిన సలార్ మూవీ గత ఏడాది డిసెంబర్ లో విడుదలయి బ్లాక్ బస్టర్ హిట్ అయింది.అప్పటివరకు ప్లాప్స్ తో ఇబ్బంది పడుతున్న ప్రభాస్ కు సలార్ సినిమా మంచి ఊరట ఇచ్చింది.ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న పాన్ వరల్డ్ మూవీ “కల్కి 2898AD”. ఈ సినిమాను మహానటి ఫేమ్ నాగ అశ్విన్ తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమా లో అమితాబ్ ,కమల్ వంటి లెజెండరీ యాక్టర్స్ నటిస్తున్నారు. అలాగే బాలీవుడ్ బ్యూటీస్ దీపిక పదుకొన్, దిశా పటాని హీరోయిన్స్ గా నటిస్తున్నారు.ఈ సినిమాతో పాటు ప్రభాస్ టాలీవుడ్ డైరెక్టర్ మారుతి డైరెక్షన్‌లో చేస్తున్న మూవీ ‘రాజాసాబ్’.
హార్రర్ కామెడీ జోనర్‌లో వస్తోన్న ఈ మూవీలో మలయాళ భామ మాళవికా మోహనన్ మరియు ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ యాక్టర్ సంజయ్ దత్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. సంజయ్ దత్ ఇందులో ప్రభాస్ తాతగా కనిపించబోతున్నాడని సమాచారం .తాజాగా ఈ మూవీ నుంచి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ వైరల్ అవుతుంది . నిధి అగర్వాల్ హైదరాబాద్‌లో జరుగుతున్న రాజాసాబ్ షూట్‌లో జాయిన్ అయిందని సమాచారం. కొన్ని రోజులుగా జరుగుతున్న షూటింగ్‌లో ప్రభాస్, నిధి అగర్వాల్‌పై వచ్చే సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారని తెలుస్తుంది. తాజా షెడ్యూల్‌కు సంబంధించిన మరిన్ని వివరాలపై త్వరలోనే మేకర్స్ క్లారిటీ ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని మారుతి టీం తెలుగు మరియు తమిళంతోపాటు వివిధ భాషల్లో విడుదలకు ప్లాన్ చేస్తోంది . ఇప్పటికే లాంఛ్ చేసిన రాజాసాబ్ టైటిల్ మరియు ఫస్ట్ లుక్ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది. ఈ మూవీ 2025 సంక్రాంతి సీజన్‌లో విడుదల కానున్నట్టు తెలుస్తుంది .
