Site icon NTV Telugu

EK DIn : ఆ హీరోతో అవసరమా సాయి పల్లవి.. నెటిజన్స్ ట్రోలింగ్

Sai Pallavi

Sai Pallavi

సాయి పల్లవి.. ఈ పేరు సినిమాలో ఉంటె చాలు మినిమమ్ గ్యారెంటీ ఓపెనింగ్ ఉంటుంది. సాయి పల్లవి చూజ్ చేసుకునే సినిమాలు అలా ఉంటాయి. స్టార్ హీరో సినిమా అనో లేదా  భారీ రెమ్యునరేషన్ వస్తుందని సినిమాలు చేయదు. చేసే నాలుగు సినిమాలైన మంచివి చేయాలనే ఉద్దేశంతో సెలెక్టీవ్ గా వెళ్తోంది. కానీ ఇప్పడు సాయి పల్లవి చేస్తున్న ఓ సినిమా పట్ల కాస్తంత నెగిటివీటి చూస్తోంది సాయి పల్లవి. అందుకు కారణం లేకపోలేదు.

Also Read : Siddhu Jonnalagadda : కోహినూర్ క్యాన్సిల్.. ‘బ్యాడాస్’ అఫీషియల్

బాలీవుడ్  ఖాన్ హీరోలలో ఒకరైన అమిర్ ఖాన్ తాను సినిమాలు తగ్గించి తన కొడుకు జునైద్ ఖాన్ ను హీరోగా నిలబెట్టాలని తెగ ప్రయత్నిస్తున్నాడు. అందుకోసం తొలి సినిమాగా తమిళ్ సూపర్ హిట్ లవ్ టుడే ను లవ్ యాప పేరుతో రీమేక్ చేసాడు. శ్రీదేవి చిన్న కుమార్తె ఖుషి కపూర్ హీరోయిన్ గా అరంగ్రేటం చేసిన ఈ సినిమా డిజాస్టర్ అయింది. అయినా సరే అమిర్ తన జునైద్ ఖాన్ కు ఎలాగైనా హిట్ ఇవ్వాలని తాపత్రేయపడుతున్నాడు. అందుకోసం ఈ సారి ఏకంగా సాయి పల్లవిని రంగంలోకి దింపాడు. సునీల్ పాండే దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఏక్ దిన్’ అనే ఈ సినిమాలో జునైద్ ఖాన్ సరసన సాయి పల్లవి నటిస్తోంది. షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా ఈ ఏడాది నవంబర్ 7న రిలీజ్ కాబోతుంది. అమరన్ తర్వాత నితిన్ సరసన ఓ సినిమా కోసం సాయి పల్లవి సంప్రదించగా నో చెప్పిన ఈ భామ అసలు యాక్టింగ్ రాని జునైద్ ఖాన్ నటించేందుకు ఎలా ఒప్పుకుంది అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Exit mobile version