NTV Telugu Site icon

Vijay Devarakonda-Rashmika : మళ్ళీ దొరికిపోయిన విజయ్, రష్మిక.. ఆ ఫొటోతో బుక్కయ్యారు..

Rashmika And Vijay

Rashmika And Vijay

Vijay Devarakonda-Rashmika: టాలీవుడ్ రూమర్డ్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న మరోసారి అడ్డంగా బుక్కయ్యారు. వీరిద్దరి మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ ఉందంటూ కొద్ది రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. అయితే తాము ఫ్రెండ్స్ మాత్రమే అంటూ ఈ రూమర్స్‌ని తరచూ వారు ఖండిస్తున్నారు. అయినప్పటికీ వీరి ప్రేమ ప్రచారానికి మాత్రం చెక్ పడటం లేదు. వారు జంటగా ఎప్పుడు కనిపించినా.. వెంటనే వార్తల్లోకి ఎక్కుతున్నారు. కలిసి వెకేషన్స్, టూర్స్, ఫెస్టివల్స్ జరుపుకుని సీక్రెట్‌గా ఉంచే ప్రయత్నం చేస్తున్నారు.. కానీ వారు షేర్ చేసిన ఫొటోలతో నెటిజన్ల చేతికి చిక్కుతున్నారు. నిజానికి విజయ్ దేవరకొండ, రష్మికలు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటారు. వారు ఏం చేసినా దానిని సోషల్ మీడియాలో పంచుకుంటూనే ఉంటారు. అలా ఇద్దరు జంటగా వెకేషన్స్‌కి వెళ్లి.. సింగిల్‌గా స్టేటస్‌లు పెడుతుంటారు. కానీ బ్యాగ్రౌండ్ లోకేషన్‌తో దొరికిపోతుంటారు.

Read Also: Tamil Movies : ఆ రెండు సినిమాలకు షాక్ ఇచ్చిన తెలుగు ప్రేక్షకులు..

తాజాగా మరోసారి అలాగే చేసి.. తప్పులో కాలేసారు. విజయ్ తన ఫ్యామిలీతో కలిసి తన నివాసంలో దీపావళి సెలబ్రేట్ చేసుకున్నాడు. అవే ఫొటోలను షేర్ చేస్తూ అందరికి హ్యాపీ దీపావళి అంటూ విష్ చేశాడు. అలాగే రష్మిక కూడా తన ఫొటోను షేర్ చేస్తూ దీపావళి విషెస్ తెలిపింది. ఇంకేముంది రష్మిక ఫొటోను చూసి అంతా పట్టేశారు. ఆమె విజయ్ ఇంట్లోనే ఉందని, ఇద్దరు ఒకే చోట పండగ జరుపుకున్నారంటూ రూమర్స్ గుప్పుమన్నాయి. వేరు వేరు లోకేషన్లో ఫొటో దిగిన.. దీపావళి డేకరేషన్ చూసి పట్టేశారు నెటిజన్లు. విజయ్ ఇంటి ముందు క్రాకర్స్ కాలుస్తుండగా ఇంటిని అలంకరించిన లైట్స్, రష్మిక దిగిన లోకేషన్లో ఉన్న లైట్స్ ఒకేలా ఉన్నాయి. దీంతో రష్మిక దీపావళికి విజయ్ ఇంట్లో వాలిపోయిందని, ఈ రూమర్డ్ కపుల్ కలిసే దీపావళి సెలబ్రేట్ చేసుకున్నారంటూ వార్తలు పుట్టుకొచ్చాయి.

Read Also: Sai Dharam Tej: ఎంతపని చేశావు రా.. వరుణ్ పెళ్లిపై సాయి ధరమ్ తేజ్ కామెంట్స్!

ఇదిలా ఉంటే విజయ్ ఇంట్లో ఎలాంటి వేడుక అయినా రష్మికకు ఆహ్వానం ఉంటుంది. విజయ్‌తోనే కాదు అతడి ఫ్యామిలీతోనూ రష్మికకు మంచి అనుబంధం ఉంది. విజయ్ తమ్ముడు ఆనంద్ దేవరకొండ సినిమాల ఈవెంట్స్‌కి రష్మిక హాజరై ప్రమోట్ చేస్తుంది. గతంలో విజయ్ తన తల్లి, తండ్రితో దుబాయ్ వెకేషన్‌కు వెళ్లగా.. వారి వెంట రష్మిక కూడా వెళ్లిన సంగతి తెలిసిందే. దీంతో వీరిద్దరి రిలేషన్ ఎప్పటికి ఆఫిషియల్ అవుతుందా? అని ఫ్యాన్స్ అంతా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అంతేకాదు విజయ్-రష్మిక పెళ్లి చేసుకుంటే బాగుంటుందని తరచూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తుంటారు. మరి వీటికి ఈ రూమర్డ్ కపుల్ నుంచి ఎలాంటి క్లారిటీ వస్తుందో చూడాలి. కాగా ప్రస్తుతం రష్మిక బాలీవుడ్ చిత్రం యానిమల్ మూవీతో బిజీగా ఉండగా.. విజయ్ ఫ్యామిలీ స్టార్ మూవీ షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు.

Show comments