NTV Telugu Site icon

SSMB29 : మహేష్ మూవీ కోసం రాజమౌళి ఆ బుక్స్ రిఫరెన్స్ గా తీసుకుంటున్నాడా..?

Ssmb29

Ssmb29

SSMB29 : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ఏడాది గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో మెప్పించి మంచి విజయం సాధించింది.ప్రస్తుతం మహేష్ తన తరువాత మూవీపై ఫోకస్ పెట్టారు.మహేష్ తరువాత సినిమాను దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమా కోసం మహేష్ ఇప్పటికే తన లుక్ ను మార్చుకున్నారు.ఈ సినిమా ఎస్ఎస్ఎంబి 29 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతుంది.

Read Also :Devara :ప్రీ పోన్ అయిన ఎన్టీఆర్ ‘దేవర’.. రిలీజ్ పోస్టర్ వైరల్..

ఈ సినిమాను దర్శకుడు రాజమౌళి ఆఫ్రికన్ అడ్వెంచరస్ మూవీగా తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాను దుర్గ ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాను రాజమౌళి బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాలో మహేష్ పాత్ర హనుమాన్ స్పూర్తితో స్పెషల్ డిజైన్ చేసినట్లు సమాచారం.ఈ పాత్ర కోసం మహేష్ సిక్స్ ప్యాక్ లుక్ లో కనిపించనున్నట్లు సమాచారం.ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి ఓ న్యూస్ బాగా వైరల్ అవుతుంది.ఈ సినిమా కోసం రాజమౌళి రెండు పాపులర్ బుక్స్ ని రిఫరెన్స్ గా తీసుకోనున్నట్లు సమాచారం.ఆ బుక్స్ ఏమిటంటే ఆఫ్రికన్ రైటర్ విల్బర్ స్మిత్ రాసిన the triumph of the sun ,kings of kings పుస్తకాల రైట్స్ ను రాజమౌళి కొనుగోలు చేసినట్లు ఓ న్యూస్ బాగా వైరల్ అవుతుంది.

Show comments