IRUMUDI Glimpse : ఇరుముడి గ్లిమ్స్ రిలీజ్.. రవితేజకు హిట్ గ్యారంటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాస్ మహారాజా రవితేజ హీరోగా, టాలీవుడ్ సెన్సిబుల్ డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న తాజా చిత్రం ‘ఇరుముడి‘. ఈ సినిమాలో రవితేజను ఒక సరికొత్త, వైవిధ్యమైన పవర్ ఫుల్ అవతార్‌లో దర్శకుడు ప్రజెంట్ చేయబోతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన క్రేజీ అప్డేట్ తాజాగా విడుదలైంది. ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నా ఇరుముడి గ్లింప్స్‌ను రిలీజ్ చేసారుమేకర్స్. పూర్తిగా ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా గ్లింప్స్ చుస్తే రవితేజ కెరీర్లో ఇదొక మైలురాయిగా నిలిచేలా కనిపిస్తోంది.
Also Read
- Vijay Deverakonda : "నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!" -
- Rashmika : "పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!"
- Rahul Sankrityan : విజయ్ - రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
- JoJo Glimpse : రాయలసీమ వర్షాలొస్తే వజ్రాలు దొరుకుతాయా?.. రచ్చ రేపుతున్న రస్టిక్ లవ్ స్టోరీ!
ఈ గ్లింప్స్ ప్రధానంగా తండ్రీ, కూతుళ్ల మధ్య ఉండే ఎమోషనల్ బాండింగ్, ఒక బాధ్యతాయుతమైన తండ్రిగా రవితేజ సరికొత్త లుక్‌లో దర్శనమిచ్చాడు. కూతురుని గారాబంగా చూసుకునే తండ్రి.. కూతురు కోసం అయ్యప్ప మాల ధరించిన తండ్రి వంటి భావోద్వేగాలను పర్ఫెక్ట్ బ్యాలెన్స్ చేస్తు చూపించాడు దర్శకుడు. కేవలం ఫ్యామిలీ ఎమోషన్స్ మాత్రమే కాకుండా, ఈ చిత్రానికి ఒక వైవిధ్యమైన డివోషనల్ టచ్ కూడా ఉన్నట్లు గ్లింప్స్ లో చూపించాడు. టైటిల్ ‘ఇరుముడి’కి తగ్గట్టే కథలో డివోషనల్ టచ్ ఉంటూనే రవితేజ సినిమా అంటే అభిమానులు ఆశించే మాస్ ఎలిమెంట్స్ కూడా ఇందులో పుష్కలంగా ఉన్నాయి. ఒకవైపు ఎమోషన్స్, డివోషనల్ టచ్‌తో సాగుతూనే.. మరోవైపు రవితేజ మార్క్ పవర్ఫుల్ యాక్షన్ ఎపిసోడ్స్ ఈ సినిమాలో నెక్స్ట్ లెవెల్లో ఉండబోతున్నాయని హింట్ ఇచ్చారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ విలువలు ఈ గ్లింప్స్‌ను మరింత గ్రాండ్‌గా మార్చాయి. ఇక జీవి ప్రకాష్ నేపథ్య సంగీతం గ్లిమ్స్ రేంజ్ ను పెంచింది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఇరుముడి ఆగస్టు 14న రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Explainer: TVS ఫ్యామిలీ గొడవేంటి?
-
World Standards Day : మనం కొనే వస్తువులు నాణ్యమైనవేనా? ప్రతి వస్తువు వెనుక ఉన్న అసలు కథ ఇదే.!
-
Be Bald and Be Free Day : బట్టతల అంటే అందమే.. ఆత్మవిశ్వాసానికి కొత్త నిర్వచనం
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!