NTV Telugu Site icon

ఇంట్రెస్టింగ్ బ్యాక్ డ్రాప్ లో రామ్, లింగుసామి మూవీ…?

Interesting backdrop for Ram and Lingusamy’s RAPO19

ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని, ప్రముఖ దర్శకుడు లింగుసామి కాంబినేషన్ లో “రాపో 19” తెరకెక్కనున్న విషయం తెలిసిందే. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌లో శ్రీనివాస చిత్తూరి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ ద్విభాషా చిత్రంలో రామ్ సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. అయితే తాజా సమాచారం మేరకు ఈ ఆసక్తికరమైన బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రం రూపొందనుందట. రామ్ కోసం డైరెక్టర్ లింగుసామి ఆసక్తికర కథనాన్ని సిద్ధం చేశారట. అదేంటంటే… “రాపో 19” ఫ్యాక్షనిజం నేపథ్యంతో అవుట్-అండ్-అవుట్ యాక్షన్ థ్రిల్లర్ గా భారీ బడ్జెట్ తో తెరకెక్కనుంది అంటున్నారు. కక్ష బ్యాక్‌డ్రాప్‌తో ఫుల్-ఆన్ కమర్షియల్ గా నిర్మితమయ్యే ఈ చిత్రంలో నటించడానికి రామ్ కూడా ఉత్సాహంగా ఉన్నట్లు చెబుతున్నారు. ఈ కథతో తెలుగు, తమిళ ప్రేక్షకులను అలరించేందుకు లింగుసామి ఇప్పుడు స్క్రిప్ట్‌కు తుది మెరుగులు దిద్దుతున్నారట. కరోనా పరిస్థితులు కుదుటపడ్డాక సినిమా షూటింగ్ ప్రారంభం అవుతుంది.