Indian 3 : ఇండియన్ 3.. సేనాపతి తిరిగివస్తున్నాడు..

Indiyan 3

Indiyan 3

లోకనాయకుడు కమల్ హాసన్ మరియు క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ కలయికలో 1996లో వచ్చిన భారతీయుడు ఎలాంటి సంచలనాలు సృష్టించిందో చెప్పక్కర్లలేదు. ఆ తర్వాత 2024లో భారతీయుడకు సీక్వెల్ గా ఇండియన్ 2ను తీసుకువచ్చాడు శంకర్. కానీ భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బిగ్గెస్ట్ ప్లాప్ గా నిలిచింది. అసలే ప్లాప్స్ లో ఉన్న శంకర్ కు ఈ సినిమా మరింత నెగిటివిటీని తీసుకువచ్చింది. అయితే ఇండియన్ 2 టైమ్ లోనే ఈ సినిమాకు సిక్వీల్ గా భారతీయుడు 3 షూటింగ్ కూడా ఆల్మోస్ట్ ఫినిష్ చేసాడు శంకర్. 

పార్ట్ 2 డిజాస్టర్ కావడంతో ఇక పార్ట్ 3 ఉండదని అందరు అనుకున్నారు. కానీ అందరిని ఆశ్చర్యపరుస్తూ భారతీయుడు 3ని రిలీజ్ చేయబుతున్నామని ప్రకటించింది చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్. అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ భారీ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘భారతీయుడు 3: వార్ మోడ్‘ నుండి మేకర్స్ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. “అవినీతిపై ఏమాత్రం సహనం లేని సేనాపతి మళ్లీ తిరిగివచ్చాడు.. సరికొత్త యుద్ధం మొదలైంది!” అంటూ చిత్రబృందం ప్రకటించింది. అయితే భారతీయుడు 2 రిలీజ్ ప్రమోషన్స్ లో కమల్ హాసన్ మాట్లాడుతూ ‘ నేను ‘ భారతీయుడు పార్ట్ 3’కి పెద్ద అభిమానిని. కొందరు నాకు మొదటి భాగం ఇష్టమని, మరికొందరు రెండో భాగం ఇష్టమని అంటుంటారు కానీ నాకు ఇష్టమైనది మాత్రం ఇండియన్ 3. మరి బిగ్గెస్ట్ డిజాస్టర్స్ కి సీక్వెల్ గా వస్తున్న ఇండియన్ 3 ఎప్పుడు రిలీజ్ అవుతోందో ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి.