NTV Telugu Site icon

రెహ్మాన్ సంగీత దర్శకత్వంలో పాడాలని ఉందన్న హాలీవుడ్ సింగర్! ఆస్కార్ విన్నర్ ఏమన్నాడంటే…

ఇండియన్ సినిమా సెలబ్రిటీలు, ముఖ్యంగా, బాలీవుడ్ జనాలు హాలీవుడ్ ఐకాన్స్ గురించి చాలా సార్లు మాట్లాడుతుంటారు. తమ అభిమాన నటుడు, నటీ అంటూ కొందరి పేర్లు చెబుతుంటారు. ఇక మన సెలబ్స్ కు వెస్ట్రన్ సింగర్స్ అన్నా అభిమానం ఎక్కువే. చాలా మంది పాశ్చాత్య పాప్ సింగర్స్ కి మన దగ్గర బోలెడు మంది వీఐపీ ఫ్యాన్స్ ఉన్నారు. కానీ, ఏఆర్ రెహ్మాన్ విషయంలోనూ సీన్ రివర్స్ అనే భావించాలి…
ఆస్కార్ గెలిచిన మన ఇండియన్ మ్యూజికల్ వండర్ ఏఆర్ రెహ్మాన్. ఆయన సంగీతం గురించి మనకు ఎప్పట్నుంచో తెలుసు. కానీ, ‘జయహో’ అంటూ ఆయన హాలీవుడ్ లో కాలుమోపాక వెస్ట్రన్ కంట్రీస్ లోనూ ఆయన అభిమానులు పెరిగారు. ‘స్లమ్ డాగ్ మిలియనీర్’ తరువాత సామాన్యులే కాదు విదేశాల్లోని ప్రముఖులు కూడా రెహ్మాన్ పై అభిమానం చాటుకుంటున్నారు. ఇక సెలెనా గోమెజ్, టేలర్ స్విఫ్ట్ లాంటి సెలబ్రిటీ సింగర్స్ అయితే ఆయన సంగీత దర్శకత్వంలో తమకు పాడాలని ఉంది అంటూ ఇంటర్వ్యూల్లో ప్రకటిస్తున్నారు. అంతర్జాతీయ ప్రఖ్యాతి పొందిన సెలీనా గోమెజ్, టేలర్ స్విఫ్ట్ ఇద్దరూ కూడా రెహ్మాన్ గురించి గతంలో చాలా గొప్పగా చెప్పారు!
మన ఆస్కార్ విన్నర్ గురించి హాలీవుడ్ సింగర్స్ ఆహా ఓహో అంటున్న నేపథ్యంలో రీసెంట్ గా ఆయన్ని ఓ షో హోస్ట్ అదే విషయంపై ప్రశ్నించారు. కాస్త సరదాగా సమాధానం ఇచ్చిన రెహ్మాన్ ‘’నేను ఇండియాలో ఉంటాను. వాళ్లంతా ప్రపంచానికి అటు వైపు ‘వెస్ట్’లో ఉంటారు. కాబట్టి నన్ను పొగుడుతున్న వార్ని కలుసుకునే అవకాశం ఇంత వరకూ రాలేదు’’ అన్నాడు! అంతే కాదు, ‘’తనతో పని చేయాలనుకుంటోన్న సింగర్స్ గురించి నా మ్యానేజర్లకి తెలుసో లేదో’’ అని రెహ్మాన్ అన్నాడు.
ఇంటర్నేషనల్ ఫేమ్ సంపాదించుకున్న సింగర్ సెలెనా గోమెజ్ ఏఆర్ రెహ్మాన్ సంగీత దర్శకత్వంలో తనకు ఓ బాలీవుడ్ మూవీ కోసం పాట పాడాలని ఉందంటూ 2020లో కామెంట్ చేసింది. చూడాలి మరి ఆమె లాంటి పాశ్చాత్య అభిమానుల కోసం రెహ్మాన్ త్వరలో ఏదైనా ‘నిర్ణయం’ తీసుకుంటాడేమో…