రామ్ పోతినేని హీరోగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ ఎంతటి ఘన విజయం సాధించిందో తెలిసిందే. దానికి కొనసాగింపుగా వస్తోన్న చిత్రండబుల్ ఇస్మార్ట్. ప్రస్తుతం షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం ఆగస్టు 15న విడుదలకు రెడీగా ఉంది. ఇటీవల ఈ చిత్రం నుండి విడుదలైన ఫస్ట్ సింగిల్ కు మంచి స్పందన లభించింది.
కాగా ఈ చిత్రంలో ‘మార్ ముంత చోర్ చింత’ అని సాగే సెకండ్ సింగల్ ను జులై16న విడుదల చేయనున్నట్టు పోస్టర్ విడుదల చేసింది నిర్మాణ సంస్థ. సెకండ్ సాంగ్ రిలీజ్ కు సంబంధించి హైదరాబాద్ లో సినిమాలకు అడ్డాగా భావించే ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని దేవి థియేటర్ లో ఈ నెల 16న సాయంత్రం 6:00 గంటలకు భారీ ఈవెంట్ నిర్వహించబోతున్నట్టు నిర్మాత ఛార్మి తెలిపారు. ఈ కార్యక్రమంలో హీరో రామ్ పోతినేని, దర్శకుడు పూరి జగన్నాధ్ తో పాటు యూనిట్ సభ్యులు పాల్గొనబోతున్నట్టు సమాచారం. ఆ రోజే డబల్ ఇస్మార్ట్ టీజర్ రిలీజ్ డేట్ ప్రకటిస్తారని తెలుస్తోంది.
స్కంధ ఫ్లాప్ తర్వాత వస్తోన్న ఈ చిత్రంపై రామ్ ఫ్యాన్స్ ఎన్నో అంచనాలతో ఉన్నారు. ఈ చిత్రంతో హిట్ కొట్టి రామ్ సక్సెస్ ట్రాక్ లోకి వస్తాడని ఆశగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు పూరి జగన్నాధ్ కు డబుల్ ఇస్మార్ట్ చాల కీలకం. లైగర్ లాంటి భారీ ఫ్లాప్ తో వెనుకబడ్డ పూరి, ఈ చిత్రం తో బౌన్స్ బ్యాక్ అవుతాడని ఇండస్ట్రీ టాక్. స్వాతంత్రదినోత్సవం కానుకగా విడుదలవబోతున్న ఈ డబుల్ ఇస్మార్ట్ కు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.
Alao Read: Kalki: మనల్ని ఎవడ్రా ఆపేది..కల్కి అన్ స్టాపబుల్..