ఫోటో అంటే… చరిత్రలో ఓ క్షణాన్ని అలా బంధించి, భద్రంగా దాచి పెట్టటం! సెల్ ఫోన్లు, మొబైల్ కెమెరాలు వచ్చాక… ఇప్పుడంటే ఛాయాచిత్రల స్థాయి కాస్త తగ్గిపోయిందిగానీ… ఒకప్పుడు అవి అమూల్యం! అటువంటి ఒక ఫ్లాష్ బ్యాక్ పిక్ తమిళ కమెడియన్ అండ్ క్యారెక్టర్ ఆర్టిస్త్ మనోబాల ట్విట్టర్ లో షేర్ చేశాడు. ఆయన నెటిజన్స్ తో పంచుకున్న ఫోటోకి ‘విత్ మై డైరెక్టర్ అండ్ అరుణ’ అని క్యాప్షన్ రాశాడు.
ఇంతకీ, మనోబాల షేర్ చేసిన ఫోటో చూసిన నెటిజన్స్… ఎందుకు ఒకింత ఆశ్చర్యపోయారంటే… అది 1980 నాటి ‘కల్లుక్కుల్ ఈరమ్’ సినిమా షూటింగ్ టైంలోనిది. ఆ సినిమా డైరెక్టర్ పీ.ఎస్. నివాస్. అయితే, ఫోటోలో డైరెక్టర్ తో పాటూ అరుణతో కలసి ఉన్నాను అని తన గురించి తాను చెప్పుకున్నాడు మనోబాల. ‘కల్లుక్కుల్ ఈరమ్’ సినిమాతోనే హీరోయిన్ అరుణ కోలీవుడ్ కి పరిచయం అయింది. అదే సినిమాతో మన విజయశాంతి కూడా తమిళ తెరపై తొలిసారి కనిపించింది. ఇక మనోబాల చెప్పిన దాని ప్రకారం… ఆయన షేర్ చేసిన ఫోటోలో… స్పష్టంగా కనిపిస్తోన్న ముగ్గురితో బాటూ బ్యాక్ గ్రౌండ్ లో డైరెక్టర్ భారతీరాజా కూడా ఉన్నారు. ఆ సినిమాలో ఆయన కూడా నటించారు.
మనోబాల ట్విట్టర్ లో షేర్ చేసిన అలనాటి ఛాయాచిత్రం చాలా మందిని ఆకర్షించింది. ఇప్పుడు ఈ త్రోబ్యాక్ పిక్ వైరల్ అవుతోంది!
అలనాటి ఛాయాచిత్రం చూసి ఆశ్చర్యపోతోన్న నెటిజన్స్!
Show comments