Site icon NTV Telugu

Prema Ledhani: సినిమా రివ్యూలు చెప్తూ హీరో అయ్యాడు.. టీజర్ రిలీజ్!

Premaledau

Premaledau

ఒకప్పుడు ఐమాక్స్ బయట సినిమా రివ్యూలు చెప్పిన లక్ష్మణ్ టేకుముడి హీరోగా మారాడు. రాధికా జోషి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి ‘ప్రేమ లేదని’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. జి.డి.ఆర్ మోషన్ పిక్చర్స్ బ్యానర్‌పై శ్రీని ఇన్ఫ్రా ఈ సినిమాను నిర్మిస్తుండగా, జి.డి. నరసింహ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన గ్లిమ్స్ ను ఆదివారం చిత్ర బృందం విడుదల చేసింది. టీజర్ చూస్తుంటే, ఈ సినిమాను ఓ హార్ట్‌ఫుల్ ఎమోషనల్ లవ్ స్టోరీగా తెరకెక్కించినట్లు స్పష్టమవుతోంది. ముఖ్యంగా యూత్‌ను ఆకట్టుకునేలా టీజర్‌ను కట్ చేశారు.

Also Read :Nagadurga : ధనుష్ మేనల్లుడి సినిమాలో హీరోయిన్గా ఫోక్ సెన్సేషన్

హీరో లక్ష్మణ్ టేకుముడి, సురేష్ గురు మధ్య వచ్చే కామెడీ సన్నివేశాలు, హీరో హీరోయిన్ల లవ్ ట్రాక్, రొమాంటిక్ సీన్లు టీజర్‌కే హైలైట్‌గా నిలిచాయి. ప్రస్తుత ట్రెండ్‌కు తగ్గ కథాంశంతోనే ఈ సినిమాను రూపొందించినట్లు టీజర్ ద్వారా తెలుస్తోంది. సాంకేతికంగా కూడా టీజర్ ఉన్నత స్థాయిలో ఉంది. జాన్ విక్టర్ పాల్ అందించిన విజువల్స్ (దృశ్యాలు) ప్రత్యేక ఆకర్షణగా నిలవగా, సుహాస్ అందించిన సంగీతం దానికి చక్కగా కుదిరింది. చిత్ర బృందం తెలిపిన వివరాల ప్రకారం, సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఇప్పటికే పూర్తయ్యాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి, త్వరలోనే సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించనున్నారు.

Exit mobile version