Site icon NTV Telugu

Ramcharan : క్లింకారా కు తినిపిస్తుంటే నాలో సూపర్ పవర్స్ వచ్చేస్తాయి..

Ramcharan (1)

Ramcharan (1)

Ramcharan : మెగా మనవరాలు క్లింకారా రాకతో మెగా ఫ్యామిలీ ఎంతో సంతోషంగా వుంది .తన ముద్దుల కూతురుని చూసుకుంటూ రాంచరణ్ తెగ ముసిరిసిపోతున్నాడు.ఫాథర్స్ డే సందర్భంగా రాంచరణ్ నేషనల్ మీడియాకు స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. క్లింకారా వచ్చాక తన జీవితం ఎంత సంతోషంగా మారిందో రాంచరణ్ చెప్పుకొచ్చాడు.క్లింకారా రాకతో మా ఇల్లు ఆనందాల హరివిల్లుగా మారిందని రాంచరణ్ తెలిపారు.క్లింకారా పుట్టి అప్పుడే ఏడాది కావొస్తుంది.తనతో ఉంటే సమయం అసలు గుర్తుకు రాదు.రోజులన్నీ క్షణాల్లా గడిచిపోతున్నాయి.నా భార్య ఉపాసన క్లింకారే లోకంగా జీవిస్తుంది.వారిద్దరి మధ్య బాండింగ్ చూస్తుంటే ముచ్చటేస్తుంది అని రాంచరణ్ చెప్పుకొచ్చారు.

Read Also :Pushpa 2 : పుష్ప 2 షూటింగ్ ఇంకా ఎన్ని రోజులు పడుతుందంటే..?

క్లింకారా మా ఇంటికి మహారాణి ఇప్పుడిప్పుడే తాను మా అందరిని గుర్తుపడుతుంది.తనకు నేనే గోరుముద్దలు కలిపి పెడతాను.తనకు తినిపించేటప్పుడు నాలోకి సూపర్ పవర్స్ వచ్చేస్తాయి.నేను తినిపించానంటే బౌల్ ఖాళీ అవ్వాల్సిందే అని చరణ్ తెలిపారు.అలాగే క్లింకారా కోసం రాంచరణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు.ఇక మీదట తాను నెమ్మదిగా సినిమాలు తీస్తానని క్లింకారా కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాంచరణ్ తెలిపారు.వరుస షూటింగ్స్ వల్లతనని చాలా మిస్ అవుతున్నానని ఇక మీదట లోకల్ లో షూటింగ్ జరిగితే సాయంత్రం 6 గంటలకల్లా పూర్తి చేసుకొని ఇంటికి వెళ్తా అని చెప్పుకొచ్చారు.క్లింకారా స్కూల్ కి వెళ్లే వరకు తన షూటింగ్ షెడ్యూల్ ఇంతే ఉంటుంది అని చరణ్ తెలిపారు.

Exit mobile version