Site icon NTV Telugu

Siddhu Jonnalagadda : ఉమనైజరా అన్న జర్నలిస్ట్.. చాలా డిస్‌రెస్పెక్ట్‌ఫుల్‌.. షాకింగ్ రియాక్షన్

Jonnalagadda Sidhu

Jonnalagadda Sidhu

సిద్దు జొన్నలగడ్డ హీరోగా ‘తెలుసు కదా’ అనే సినిమా అక్టోబర్ 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేయగా, ఆ ప్రెస్ మీట్‌లో ఒక జర్నలిస్ట్, సిద్దు జొన్నలగడ్డను “రియల్ లైఫ్‌లో ఉమనైజరా?” అంటూ ప్రశ్న సంధించారు. దీంతో ఒక్కసారిగా షాక్ అయిన సిద్దు జొన్నలగడ్డ, “ఇది పర్సనల్ క్వశ్చన్‌లా ఉంది” అని, ప్రెస్ మీట్‌లో ఎలాంటి ప్రశ్నలకు సమాధానం చెప్పనని స్కిప్ చేశారు. తాజాగా ఇదే విషయం మీద మరోసారి ఆయనను కదిలించే ప్రయత్నం చేయగా, ఆయన ఈ మేరకు స్పందించారు.

Also Read:Ananya Panday : అందాల వేటలో కుర్రకారుకి మత్తెక్కిస్తున్న అనన్య పాండే

“నాకు ఎలా స్పందించాలో అర్థం కాలేదు. అలా మాట్లాడటం చాలా డిస్‌రెస్పెక్ట్‌ఫుల్‌. మైక్ ఉంది కదా అని అలా ప్రశ్న అడిగి మళ్ళీ నవ్వుతున్నారు. మైక్ ఉంది కదా అని ఇలాంటి ప్రశ్నలు అడగటం కరెక్ట్ కాదు. ఇక నేను దీని మీద ఏమని స్పందించాలి? నేను ఇలాంటి విషయంలో డిస్కషన్ చేయాలి అనుకోలేదు. నిజానికి అసలు రేసులో ఉందా లేదా అనుకున్న పరిస్థితి నుంచి, నిన్న ట్రైలర్‌కి పాజిటివ్ టాక్ వచ్చిన తర్వాత అంతా పాజిటివ్‌గా మారింది. అయితే, సినిమాలో పోలీస్ ఆఫీసర్‌గా ఉన్నంత మాత్రాన, నిజజీవితంలో కూడా చంపుకుంటూ తిరుగుతారా? మీరు చెప్పండి.

Also Read:Bollywood : దీపావళి రేస్ లో రష్మిక సినిమాకు పోటీగా వస్తున్న హర్షవర్థన్ రాణే

సినిమాలో డ్రగ్ అడిక్ట్ అయినంత మాత్రాన, నిజ జీవితంలో కూడా డ్రగ్స్ తీసుకుంటూ తిరుగుతున్నారా? అది సినిమా కదా. మీ చేతిలో మైక్ ఉంది కదా, మేము సమాధానం చెప్పే పరిస్థితిలో ఉన్నాం కదా అని ఇష్టం వచ్చిన ప్రశ్నలు అడగడం కరెక్ట్ కాదని నాకనిపిస్తోంది. ఈ విషయాన్ని డిస్కస్ చేయడం కూడా నాకు ఇష్టం లేదు. నిజానికి, ఆమె ఈ ప్రశ్న అడగడానికి కొద్ది సేపటి క్రితం, తమ ఛానల్‌కి ఇంటర్వ్యూ ఇవ్వమని అడిగారు. సరిగ్గా 5 నిమిషాల తర్వాత, ఇలాంటి ప్రశ్నను మాకు సంధించారు. అంటే, ఐదు నిమిషాల్లోనే ఆమె ఎలా మారిపోయిందో చూడండి. అంటే, ప్రొడ్యూసర్ డబ్బులు పెడుతున్నాడు కదా, హీరో అన్నిటికీ ఆన్సర్ ఇస్తాడు అనుకుని ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నారనిపిస్తోంది” అని సిద్దు జొన్నలగడ్డ చెప్పుకొచ్చారు.

Exit mobile version