ఐబొమ్మ (iBomma) వెబ్‌సైట్ వ్యవహారంలో ప్రధాన నిందితుడిగా ఉన్న రవి కేసులో నాంపల్లి కోర్టు కీలక తీర్పు వెలువరించింది. సైబర్ క్రైమ్ పోలీసులు దాఖలు చేసిన కస్టడీ పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు, రవిని మూడు రోజుల కస్టడీకి అనుమతి మంజూరు చేసింది. పోలీసులు రవిపై దాఖలు చేసిన నాలుగు కేసుల్లో ఒక కేసు కస్టడీ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. అయితే, మిగిలిన మూడు కేసులకు సంబంధించి కస్టడీ కోరగా, నాంపల్లి కోర్టు దానిని ఆమోదించింది. కోర్టు తీర్పు ప్రకారం, ఒక్కో కేసుకు ఒక్కో రోజు చొప్పున మూడు రోజుల కస్టడీకి అనుమతి లభించింది. సైబర్ క్రైమ్ పోలీసులు రవిని శనివారం, సోమవారం మరియు మంగళవారం కస్టడీలోకి తీసుకొని విచారించనున్నారు.
Also Read :Akhanda 2: షాకింగ్.. 2026లో ‘అఖండ తాండవం’ రిలీజ్?
పోలీసులు తమ వాదనలను కోర్టు ముందు సమర్పించగా, నాంపల్లి కోర్టు ఆ వాదనలను ఏకీభవిస్తూ, కస్టడీకి అనుమతి ఇచ్చింది. రవి తరఫు న్యాయవాదులు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై వాదనలు సోమవారం మరోసారి వినాలని నాంపల్లి కోర్టు నిర్ణయించింది. ఐబొమ్మ రవికి వ్యతిరేకంగా పోలీసులు సమర్పించిన ఆధారాలు, అతనిపై నమోదైన కేసుల తీవ్రత దృష్ట్యా, కస్టడీలో మరింత లోతుగా విచారణ జరిపితే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని సైబర్ క్రైమ్ పోలీసులు భావిస్తున్నారు. ఈ తీర్పుతో పోలీసులకు కేసు విచారణలో మరింత ముందుకు వెళ్లడానికి అవకాశం లభించింది.
ఈ కేసు విచారణకు సంబంధించిన మరింత సమాచారం త్వరలో తెలిసే అవకాశం ఉంది.
