కొత్త దర్శకులు, కొత్త నిర్మాతలు, ఆర్టిస్టులు టెక్నీషియన్స్ కి ఇండస్ట్రీలోకి రావాలని ‘దిల్ రాజు డ్రీమ్స్’ వెబ్ సైట్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ వేడుకకు ముఖ్య అతిధులుగా హాజరై వెబ్ సైట్ ని లాంచ్ చేశారు. దిల్ రాజు డ్రీమ్స్ లాంచింగ్ ఈవెంట్ లో రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. 13 ఏళ్ల క్రితం పొద్దున లేచి ఎక్కడైనా కాస్టింగ్ కాల్స్ ఉన్నాయా అని చూసుకునేవాడిని. ఆ రోజుల్లో ఇంత ఇంటర్నెట్, సోషల్ మీడియా లేదు.
Also Read : ENERepeat : టీమ్ కన్యారాశి మళ్ళి వస్తోంది.. ఈ నగరానికి ఏమైంది – 2 స్టార్ట్
శేఖర్ కమ్ముల గారి లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా కాస్టింగ్ కాల్ అందులో చూడడం నాకు ఇంకా గుర్తుంది. దానికి అప్లై చేశాను. దాదాపు 6 నెలలు టెన్షన్ పడ్డాను. ఆ టెన్షన్ కూడా ఒక తృప్తిని ఇచ్చేది. ఒక ప్రయత్నం చేస్తున్నాం. ఒక ఆపర్చునిటీ ఉందనే ఆనందం ఉండేది. 16 వేల అప్లికేషన్స్ ఆ సినిమాకి వచ్చాయి. 11 మందిని సెలెక్ట్ చేశారు. అందులో నేను ఉన్నాను. ఆ సినిమా నా జీవితంలో పెద్ద రోల్ ని ప్లే చేసింది. ఒక అవకాశం ఎంత గొప్పదో నాకు తెలుసు. దిల్ రాజు డ్రీమ్స్ ని దిల్ రాజుకి ఎందుకు లాంచ్ చేయాలని అనిపించిందో నాకు తెలియదు కానీ ఇది లక్షలాది మందికి ఒక హోప్ ని ఇచ్చింది. దిల్ రాజు 14 మంది డైరెక్టర్స్ ని లాంచ్ చేశారు. ఈ వేదిక ద్వారా నటీనటులు, దర్శకులు, టెక్నీషియన్స్, ప్రొడ్యూసర్స్ ని లాంచ్ చేయబోతున్నారు. ఐదేళ్ల తర్వాత మీలో కూడా ఎవరో ఒకరు ఇలా స్టేజ్ మీద నిలబడి దిల్ రాజు డ్రీమ్స్ తమ డ్రీమ్ ని నెరవేర్చుకున్నామని చెప్తే చాలా ఆనంద పడతాను. ఇంత అద్భుతమైన ప్లాట్ ఫామ్ క్రియేట్ చేసిన దిల్ రాజు టీమ్ కి అభినందనలు.అందరికీ థాంక్యు’ అని అన్నారు.
