NTV Telugu Site icon

Bobby Deol : 15 ఏళ్ళు పెళ్ళాం సంపాదనతో బ్రతికాను

Bpbbydieol

Bpbbydieol

యంగ్ టైగర కు జై లవకుశ, మెగాస్టార్ కు వాల్తేర్ వీరయ్య వంటి సూపర్ హిట్స్ అందించిన దర్శకుడు బాబీ. తదుపరి సినిమాను ‘గాడ్ ఆఫ్ మాసెస్’ నందమూరి బాలకృష్ణ హీరోగా డాకు మహారాజ్ అనే సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమాలో బాలయ్యకు విలన్ గా బాలీవుడ్ ఒకప్పటి స్టార్ హీరో, ఇప్పటి స్టార్ విలన్ బాబీ డియోల్ ను తీసుకువచ్చాడు బాబీ. అయితే బాబీ డియోల్ గురించి విస్తుపోయే వాస్తవాలు తెలిపాడు డైరెక్టర్ బాబీ.

Also Read : Legally Veer : ఈ నెల 27న రిలీజ్ కానున్న ‘లీగ‌ల్లీ వీర్’

ఓ ఇంటర్వ్యూలో భాగంగా బాబీ డియోల్ గురించి ఎవరికి తెలియని విషయాలను తెలియాజేసాడు బాబీ. అయన మాట్లాడుతూ ‘ యానిమల్ కు ముందు డాకు కథ బాబీ డియోల్ కు చెప్పాను. ఆ సినిమా రిలీజ్  తర్వాత స్టార్ అయిపోయాడు. కానీ దానివెనుక చాలా ఎమోషనల్ జర్నీ ఉంది. ఒకసారి ఆయన కొడుకు వాళ్ళ అమ్మతో నాన్న ఇంక పని చేయడా అని అడిగినపుడు ఆ మాటలు విన్న డియోల్ సూసైడ్ చేసుకుందాం అనుకున్నారట. సినిమాలు లేక దాదాపు 15 ఏళ్లుగా సినిమాలు లేకుండా ఇంట్లో కూర్చుని భార్య డబ్బులతో బ్రతికాడు ఆ సమయంలో వచ్చిన ఒక తెలుగోడు సందీప్ రెడ్డి వంగా నా లైఫ్ నే మార్చేసాడు అని చాలా ఎమోషనల్ గా చెప్పాడట బాబీ డియోల్. కానీ ఇప్పుడు బాబీకి ఆడినంత రెమ్యునరేషన్ ఇవ్వడానికి నిర్మాతలు రెడీగా ఉన్నారు. అలాగే  ఈ సినిమాలో బాలయ్య కు సమానంగా బాబీ డియోల్ రోల్ ఉంటుంది’ అని అన్నాడు.

Show comments