Site icon NTV Telugu

Naga Vamsi : విజయ్ దేవరకొండను ఎందుకు టార్గెట్ చేస్తున్నారో అర్ధం కావట్లేదు

Nagavamsi

Nagavamsi

విజయ్ దేవరకొండ కథానాయకుడిగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘కింగ్‌డమ్’. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ నెల 31న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాత నాగవంశి ప్రమోషన్స్ స్పీడ్ పెంచాడు. విజయ్ దేవరకొండ గురించి కొన్ని కీలక కామెంట్స్ చేసాడు.

Also Read : HHVM : ‘హరి హర వీరమల్లు’లో పవన్ కళ్యాణ్ పాత్రకు ఇన్స్పిరేషన్ ఎవరో తెలుసానాగవంశీ మాట్లాడుతూ ‘ అసలు విజయ్ దేవరకొండను ఎందుకు జనం టార్గెట్ చేస్తారో తెలియదు. అసలు ఆయనే తన సినిమాలు ఆడట్లేదని చాలా డౌన్ లో ఉన్నాడు. మొన్న రెట్రో ప్రీ రిలీజ్ ఈవెంట్ రోజు ఎదో పొరపాటున ఒక మాట అంటే దాన్ని హంగామా చేశారు. నిన్న హాలీవుడ్ రిపోర్టర్ ఇంటర్వ్యూ చేస్తే దాన్ని ఇంకో రకంగా హంగామా చేసారు. ఎందుకు టార్గెట్ చేస్తున్నారు విజయ్ ని, ఇదివరకు అంటే ఆయన యంగ్ ఏజ్ లో ఉన్నపుడు యారొగెంట్ గా ఏదైనా మాట్లాడాడు అంటే ఎదో అనుకోవచ్చు, అసలు ఈ మధ్య అసలు ఏమి మాట్లాడట్లేదు. అయినా ఎందుకు టార్గెట్ చేస్తున్నారు. మోస్ట్ మిస్ అండర్ స్టాండింగ్ పర్సన్ విజయ్ దేవరకొండ. ఆఫ్ కెమరా విజయ్ తో మాట్లాడితే అసలు ఈయనేనా స్టేజ్ మీద అలా మాట్లాడేది అనిపిస్తుంది. అసలు ఆడియెన్స్ కు విజయ్ మీద కనీసం జాలి కూడా లేదు. ఆయన ఏమి మాట్లాడిన బూతద్దం పెట్టి చూస్తు నెగిటివ్ చేసున్నారు. ఇప్పుడు వీటన్నిటిని దాటి కింగ్‌డమ్ ఆడాలి. అందుకోసం చాలా ఎఫర్ట్ పెడుతున్నాం’ అని అన్నారు.

Exit mobile version