తిరుపతి జిల్లా చంద్రగిరి మండ లంలోని మోహన్ బాబు యూనివర్సిటీ వద్ద బుధవారం ఉద్రిక్తత నెలకొంది. వర్సిటీ క్యాంపస్ లోకి వెళ్లేందుకు మంచు మనోజ్, ఆయన సతీమణి భూమా మౌనిక యత్నించగా పోలీసులు, సెక్యూ రిటీ సిబ్బంది అడ్డుకున్నారు. కొంతకాలంగా ఆయన కుటుంబంలో వివాదం తలెత్తి చిన్న కుమారుడు మనోజ్తో ఘర్షణ జరిగిన విషయం తెలిసిందే. తన విద్యా సంస్థల్లోకి మనోజ్ ప్రవేశించకుండా అడ్డుకోవాలని మోహన్ బాబు కోర్టును ఆశ్రయించి అనుకూల ఉత్తర్వులు పొందారు.
Also Read : RC16 : రామ్ చరణ్ 16 కోసం న్యూలుక్ లో జగ్గుభాయ్.. వీడియో వైరల్
ఈ విషయమై మంచు మనోజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. మనోజ్ మాట్లాడుతూ ‘ ఈ యూనివర్సిటీపై నాకు గౌరవం ఉంది. ఇది ఏ ఒక్కరిది కాదు. చిన్నప్పటి నుండి అందరం ఈ విద్యాసంస్థల కోసం చాలా కష్టపడ్డాం. మా ఫాలోవర్స్, ఫ్యాన్స్ ను ఇక్కడికి వస్తే లాఠీ ఛార్జ్ చేస్తారు అని బెదిరిస్తున్నారు. ఎందుకు లాఠీ ఛార్జ్ చేస్తారు. నేను విద్యాసంస్థల్లోకి రావడానికి లేదు అన్నారు. అందుకు సంబందించిన నోటీసులు ఇవ్వండి. నెను కోర్టుకు వెళ్లి తేల్చుకుంటా. నేను నారా లోకేష్ మర్యాద పూర్వకంగా కలిస్తే విష్ణుకు ఎందుకు అంత భయం. హేమాద్రి నాయుడు వీళ్లంతా కలిసి యూనివర్సటీలోని స్టూడెంట్స్ ను ఇబ్బంది పెడుతున్నారు. ఆ స్టూడెంట్స్ సమస్యలను నాన్నకి వివరించి ఇలా జరుగుతుంది అని చెప్పడానికి నేను ట్రై చేస్తే నా గురించి ఆయనకి చెడుగా చెప్పి గొడవలు పెట్టడం చేస్తున్నారు. కూర్చుని మాట్లాడుకుంటే సెటిల్ అయ్యేదానికి ఇంత వరకు తెచ్చారు. ఇక్కడ మా తాత, నానమ్మ సమాధులకు నివాళులు అర్పించి వెళ్తాను ఆంటే తప్ప ఎలాంటి గొడవలు పెట్టడానికి రాలేదు’ అని అన్నారు.