Site icon NTV Telugu

Sridevi Drama Company Hyper Aadi: హైపర్ ఆది పంచ్‌పై వివాదం..

Adhi

Adhi

తెలుగు ఎంటర్టైన్‌మెంట్ రంగంలో ఎప్పుడూ తనదైన కామెడీ టైమింగ్‌తో పంచులు పేలుస్తూ, తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న వ్యక్తి హైపర్ ఆది. మొదటగా జబర్దస్త్ షో ద్వారా విపరీతమైన పాపులారిటీ సంపాదించుకున్న ఆది, ఇప్పుడు టీవీ షోల నుంచి సినిమాల వరకు తనకంటూ ఒక మంచి మార్క్ క్రియేట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ముఖ్యంగా శ్రీదేవి డ్రామా కంపెనీలో ఆయన చేసే కామెడీ, ఆటపాటలు ప్రేక్షకులను బాగా ఎంటర్టైన్ చేస్తున్నాయి. అయితే తాజాగా రిలీజ్ అయిన శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమోలో హైపర్ ఆది వేసిన ఒక పంచ్ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.

Also Read : SV Krishna Reddy : మా తరానికి ఆయనే ఇన్‌స్పిరేషన్‌ – అనిల్ రావిపూడి

సోషల్ మీడియా ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న యువకులు కూడా టీవీ రంగంలో తమ టాలెంట్ చూపిస్తున్న ఈవెంట్‌లో.. ‘బాగుండాలమ్మ నువ్వు ఎవరితో ఉన్నా’ అనే సాంగ్‌తో గుర్తింపు పొందిన అక్షిత్ మార్వెల్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆ సాంగ్ గురించి మాట్లాడుతూ హైపర్ ఆది దాన్ని డబుల్ మీనింగ్ వచ్చేలా కామెడీ చేశారు. దీంతో అయితే ఆ పంచ్ చాలా మందికి నచ్చలేదు.. ‘బాగుండాలమ్మ’ సాంగ్ అనేది ఒక ఎమోషనల్ సాంగ్, ముఖ్యంగా లవ్ ఫెయిల్యూర్ అయిన వాళ్లకు చాలా దగ్గరైన ఫీలింగ్. ఇప్పటికీ చాలా మంది ఆ సాంగ్ విని తన భావాలను బయటపెడుతుంటారు. అలాంటి సాంగ్ మీద కూడా కామెడీ చేయడం ఏమిటి నెటిజన్లు హైపర్ ఆది మీద విరుచుకుపడుతున్నారు.

కొంతమంది నెటిజన్లు, “ఎవరికీ నొప్పించని కామెడీ చేస్తేనే ఎంటర్టైన్ అవుతాం కానీ, ఇలా ఎమోషనల్ సాంగ్స్‌ను కూడా సరదాగా తీసుకోవడం తప్పు” అంటూ కామెంట్లు చేస్తున్నారు. హైపర్ ఆది కామెడీ స్కిల్స్ గురించి ఎలాంటి సందేహం లేదు. ఆయన స్టేజ్ మీద ఉంటే వినోదం గ్యారంటీ. కానీ ఇలాంటి ఎమోషనల్ సాంగ్స్ లేదా సున్నితమైన విషయాల మీద జోకులు వేయడం ఆయన ఇమేజ్‌కి హాని చేసే అవకాశం ఉంది. అందుకే ప్రేక్షకులు కోరుకుంటున్నది – ఆది తన కామెడీని అదే ఉత్సాహంతో కొనసాగించాలి, కానీ ఎమోషనల్ టాపిక్స్‌కి దూరంగా ఉండాలి.

Exit mobile version