NTV Telugu Site icon

Hyderabad : జానీ మాస్టర్‌కు పోలీసుల నోటీసులు.. పరారీలో జానీ

Untitled Design (5)

Untitled Design (5)

టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై లైంగిక ఆరోణలు నేపథ్యంలో నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసినసంగతి తెలిసిన విషయమే.  2017 లో డీషోలో జానీ మాస్టర్ కు పరిచయమైంది, ఆ తర్వాత 2019లో జానీ మాస్టర్ టీం లో అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా జాయిన్ అయ్యాను, ఓ షో కోసం జానీ మాస్టర్ తో పాటు మరో ఇద్దరితో కలిసి ముంబైకి వెళ్ళినప్పుడు ముంబైలోని హోటల్లోఅత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని బయటికి ఎవరికీ చెప్పవద్దు అంటూ బెదిరించారు, అదే మాదిరిగా షూటింగ్లో సమయంలో అతను చెప్పినట్లుగా వినకపోతే అసభ్యంగా ప్రవర్తించేవాడు మతం మార్చుకొని తనని పెళ్లి చేసుకోవాలంటూ బలవంతం చెసాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది యువతి.

Also Read : Jr. NTR : యంగ్ టైగర్ – వెట్రి మారన్ – Sun పిక్చర్స్.. ఫిక్స్..?

ఈ కేసు దర్యాప్తులో భాగంగా యువతిని విచారించిన పోలీసులు ‘జానీ మాస్టర్ కోరికలకు యువతి ఒప్పుకోకపోవడంతో బాధితురాలు జుట్టు పట్టుకొని జానీ మాస్టర్ దాడి చేశాడని, అలాగే ఆగస్టు 28న బాధితురాలికి ఒక వింత పార్శిల్ వచ్చింది, పేరు లేకుండా వచ్చిన ఆ పార్సిల్ తెరిచి చూడగా దాని లోపల ‘ Congratulations for son be care full’ అని రాసి ఆమె ఇంటి తలుపుకు  వేలాడతీసాడని’ పోలీసులు FIR లో పేర్కొన్నారు.  జానీ ప్రస్తుతం ఎవరికీ అందుబాటులోకి  లేడని, సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని ఎవరికి సమాచారం ఇవ్వకుండా తప్పించుకున్నాడుని తెలిసింది. కేసు దర్యాపు వేగవంతం చేసిన నార్సింగి పోలీసులు తాజాగా  జానీ మాస్టర్ కు నోటీసులు ఇచ్చారు, విచారణకు రావాలని, వీలైనంత త్వరగా తమ ముందు హాజారుకావాలని నోటిసుల్లో పేర్కొన్నారు పోలీసులు. మరోవైపు కొరియోగ్రాఫర్ అసోసియేషన్ అధ్యక్ష పదవి నుంచి జానీని తొలగించారు.

Show comments