బాలీవుడ్ వర్సటైల్ యాక్టర్లలో హ్యుమా ఖురేషి ఒకరు. ఆమె క్యారెక్టరైజేషన్, ఎంచుకునే రోల్స్ డిఫరెంట్‌గా ఉంటాయి. గ్యాంగ్స్ ఆఫ్ వసిపూర్‌తో కెరీర్ స్టార్ట్ చేసిన బ్యూటీ.. హ్యాట్రిక్ హిట్టు కొట్టి.. తక్కువ టైంలోనే క్రేజీ బ్యూటీగా మారిపోయింది బద్లాపూర్, జాలీ ఎల్ఎల్బీ2, మోనికా ఓ మై డార్లింగ్ చిత్రాలతో స్టార్ ఇమేజ్ దక్కించుకుంది. కానీ హ్యూమాకు క్రేజ్ తెచ్చిపెట్టింది మాత్రం మహారాణి వెబ్ సిరీస్. ఈ పొలిటికల్ థ్రిల్లర్ ఆడియన్స్ ను ఆకట్టుకుంది. ఇప్పటి వరకు ఈ సీజన్ నుండి మూడు సిరీస్‌లు వచ్చాయి. ఇప్పుడు సీజన్ 4 రాబోతోంది.
Also Read : Rashmika Mandanna : ఇండియన్ సినిమా క్వీన్ గా మారిన రశ్మిక మందన్న.. కారణం ఏంటంటే?
ఓ సాధారణ మహిళ సీఎం ఎలా అయ్యిందో, దానికి దారి తీసిన పరిస్థితిలేంటో మహారాణి వెబ్ సిరీస్‌లో చూపించబోతున్నాడు దర్శకుడు పునీత్ ప్రకాశ్. రాణి భారతిగా పవర్ ఫుల్ క్యారెక్టర్‌లో కనిపించబోతోంది హ్యూమా ఖురేషీ. బీహార్ రాష్ట్ర ప్రజల క్షేమం కోసం దేనికైనా, ఎంతకైనా తెగించే క్యారెక్టర్ ఆమెది. నవంబర్ 7 నుండి సోనీ లివ్‌లో సందడి చేయబోతోంది. అలాగే ఢిల్లీ క్రైమ్ సీజన్3లోనూ కనిపించనుంది. నవంబర్ 13న నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కాబోతోంది. అయితే ఈ మధ్య కాలంలో ఓటీటీతో ఎక్కువ కనెక్టైన హ్యూమా.. థియేటర్స్ దగ్గర తడబడుతోంది. ఈ ఏడాది మాలిక్‌లో స్పెషల్ సాంగ్ చేసింది హ్యుమా ఖురేషీ. కానీ సినిమా పెద్దగా ఆడలేదు. ఇక జాలీ ఎల్ఎల్బీ3తో మళ్లీ ఈవెంచర్‌లోకి ఎంట్రీ ఇచ్చినా సోసోగానే మారిపోయింది. ఈ రెండు పెద్దగా ఆమె కెరీర్ ప్లస్ అయితే కాలేదు.. అలాగని మైనస్ కాలేదు. ఆఫర్లకు వచ్చినా ఢోకా లేదు. ‘పూజా మేరీ జాన్’, ‘గులాబి’, ‘సింగిల్ సల్మా’తో పాటు కంప్లీటైన ‘బయాన్’ రిలీజ్ కావాల్సి ఉంది. ఇక కన్నడలోకి టాక్సిక్ తో లాంచ్ అవుతోంది. లైనప్ ఓకే ఇక మేడమ్ ఖాతాలో హిట్ పడటమే తరువాయి.
