NTV Telugu Site icon

Allu Arjun: అల్లు అర్జున్ బెయిల్ పై సర్వత్రా ఉత్కంఠ

Allu Arjun Sandhaya

Allu Arjun Sandhaya

పుష్ప 2 బెనిఫిట్​ షో సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్​దగ్గర జరిగిన తొక్కిసలాట కేసులో రేవతి అనే మహిళ మరణించిన సంగతి తెలిసిందే. ఆమె కుమారుడు ఇప్పటికీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ విషయంలో ఈ నెల 13న చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్​ను అరెస్ట్​ చేశారు. అనంతరం పోలీస్​స్టేషన్​కు తరలించి విచారించారు. ఆ తర్వాత గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించి నాంపల్లి కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. అనంతరం అల్లు అర్జున్​ను చంచల్​గూడ జైలుకు తరలించారు. మరోవైపు తనపై చిక్కడపల్లి పోలీసులు పెట్టిన కేసును కొట్టివేయాలంటూ అల్లు అర్జున్​ హైకోర్టులో క్వాష్​ పిటిషన్​ వేయగా దీనిపై విచారించిన హైకోర్టు గత నెల 30 వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.

Madhavi Latha: హీరోయిన్ మాధవీలత ప్రాస్టిట్యూట్.. జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

సంధ్య థియేటర్ ఘటన పై నమోదైన కేసులో అల్లు అర్జున్ బెయిల్ పై ఉత్కంఠ కొనసాగుతోంది. అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ పై నేడు నాంపల్లి కోర్టు తీర్పు ఇవ్వనున్నది. అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ పై ఇప్పటికే పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు. అల్లు అర్జున్ తరపు వాదనలు వినిపించారు న్యాయవాదులు. అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ కొట్టి వేయాలని పబ్లిక్ ప్రాసిక్యూషన్ కోరింది. మొత్తం మీద ఇరు వాదనలు పూర్తి కాగా బెయిల్ పిటిషన్ పై నేడు నాంపల్లి కోర్టు తీర్పు ఇవ్వనున్నది. ఎలాంటి తీర్పు వస్తుందో అని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Show comments