NTV Telugu Site icon

ఆసక్తి రేపుతున్న ‘ఉప్పెన’ దర్శకుడి రెమ్యూనరేషన్!

Huge Remuneration for Uppena Director Buchi Babu

నూతన నటీనటులతో, నూతన దర్శకుడితో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించిన ‘ఉప్పెన’ చిత్రం సరికొత్త రికార్డులను సృష్టించింది. ఈ మూవీ సాధించిన ఘన విజయంతో హీరో వైష్ణవ్ తేజ్, హీరోయిన్ కృతీశెట్టి తమ రెమ్యూనరేషన్ ను అమాంతంగా పెంచేశారనే వార్తలు వచ్చాయి. అందులో కొంత నిజం లేకపోలేదు. వీరిద్దరూ ఇప్పటికే కొన్ని సినిమాలకు కమిట్ అయ్యారు. వాటి చిత్రీకరణ సైతం శరవేగంగా సాగుతోంది. అయితే దర్శకుడు బుచ్చిబాబు నెక్ట్స్ మూవీ పై అధికారిక ప్రకటన మాత్రం ఇంతవరకూ రాలేదు. కొత్త హీరోహీరోయిన్లతో తీసిన ‘ఉప్పెన’ యాభై కోట్ల షేర్ వసూలు చేయడంతో, సహజంగానే దర్శకుడు బుచ్చిబాబు మీద కూడా చాలా మంది నిర్మాతల దృష్టి పడింది. కానీ ఎన్టీయార్ కు వీరాభిమాని అయిన బుచ్చిబాబు మాత్రం ఏ సినిమాకూ కమిట్ కాలేదని చెబుతున్నారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే సుకుమార్ తో కలిసి మైత్రీ మూవీ మేకర్స్ ఎన్టీయార్ హీరోగా నిర్మించే చిత్రానికి బుబ్చిబాబే దర్శకుడని అంటున్నారు. ఎన్టీయార్ కోసం బుచ్చిబాబు ఓ స్పోర్ట్స్ డ్రామాను తయారు చేశాడట. ఇదంతా ఓకే కానీ… ఈ మూవీకి ఏకంగా బుచ్చిబాబుకు అక్షరాల రూ. 8 కోట్ల రెమ్యూనరేషన్ ఇస్తున్నారని ఫిల్మ్ నగర్ కోడై కూస్తోంది. ఎన్టీయార్ లాంటి మాస్ స్టార్ హీరోను డైరెక్ట్ చేసే వ్యక్తికి ఆ మాత్రం పారితోషికం ఇవ్వడం తప్పేమీ కాదు అనే వాళ్ళూ లేకపోలేదు. మరి ‘ఉప్పెన’ తర్వాత బుచ్చిబాబు తెరకెక్కించబోతున్న యంగ్ టైగర్ మూవీ కూడా వంద కోట్ల క్లబ్ లో చేరిపోతుందేమో చూడాలి.