NTV Telugu Site icon

Saripodhaa Sanivaaram: నాని ‘సరిపోదా’ను సరిపెడుతున్న భారీ వర్షాలు??

Saripodhaa Sanivaaram Collections

Saripodhaa Sanivaaram Collections

Huge Rain Effect on Saripodhaa Sanivaaram Footfalls: నాని హీరోగా తెరకెక్కిన సరిపోదా శనివారం సినిమా గురువారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో ఎస్జే సూర్య విలన్ పాత్రలో నటించాడు. భిన్నమైన సినిమాలు చేస్తాడు అనే పేరు ఉన్న వివేక్ ఆత్రేయ డైరెక్ట్ చేసిన ఈ సినిమాని డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద డివివి దానయ్య నిర్మించాడు. ఈ సినిమాకి మొదటి ఆట నుంచే కాస్త పాజిటివ్ టాక్ రావడంతో హౌస్ ఫుల్స్ కూడా కనిపించాయి. కానీ ఇప్పుడు ఈ సినిమా మీద వరుణుడి ఎఫెక్ట్ గట్టిగా పడినట్లుగా తెలుస్తోంది. నిజానికి గురువారం నాడు సినిమా రిలీజ్ అయితే దాదాపు శనివారం నుంచి వర్షాలు కురుస్తూనే ఉన్నాయి.

NBK 50 in TFI: ఆయన కూడా వచ్చి ఉంటే ఫ్రేమ్ నిండుగా ఉండేది మాష్టారూ!!

ఈ కుండపోత వర్షాలకు తెలంగాణలో చాలా ప్రాంతాల్లో వాగులు పొంగిపొర్లుతుంటే ఏపీలో చాలా ప్రాంతాలు నీట మునిగిన పరిస్థితి కనిపిస్తోంది. ఇలాంటి సందర్భంలో సర్వైవ్ అవడమే పెద్ద టాస్క్ కాబట్టి సినిమాల వంటి వాటి జోలికి జనాలు వెళ్లడం చాలా కష్టమే. వర్షాలు- వరదలు ముంచెత్తుతున్న నేపథ్యంలో చాలా చోట్ల ఫుట్ ఫాల్స్ తగ్గినట్లుగా ట్రేడ్ వర్గాలు తేల్చాయి. అయితే సినిమా యూనిట్ మాత్రం తమది చాలా లాంగ్ రన్ ఉండే సినిమా కాబట్టి ఈ వారం రాకపోయినా వచ్చేవారం రావాల్సిన ఆడియన్స్ ధియేటర్లకు వస్తారని థియేటర్ లోనే సినిమా చూస్తారని నమ్మకంగా చెబుతోంది. అయితే మరొక ప్రచారం మేరకు ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి 80% రికవరీ జరిగిపోయింది అని అంటున్నారు. ఆ లెక్కన ఇప్పటికే కొంత సేఫ్ జోన్ లోకి వెళ్ళినట్టే. అందులో నిజా నిజాలు ఎంతవరకు ఉన్నాయనేది తెలియాల్సి ఉంది.

Show comments