Site icon NTV Telugu

Nara Rohith : నారావారి అబ్బాయ్ సినిమాకు ‘హాట్ స్టార్’ భారీ ప్రైజ్

Nara Rohith

Rohith Nara

యంగ్ హీరో నారా రోహిత్ ల్యాండ్‌మార్క్ 20వ మూవీ ‘సుందరకాండ’. నూతన దర్శకుడు వెంకటేష్ నిమ్మలపూడి దర్శకత్వం వహించగా సంతోష్ చిన్నపొల్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి నిర్మిస్తున్నారు. నారా రోహిత్ ఇందులో సిద్ధార్థ్ అనే సింగిల్ మ్యాన్ పాత్రలో కనిపించారు. తను మ్యారేజ్ ఏజ్ దాటినప్పటికీ, ఐదు క్యాలిటీస్ కలిగి ఉన్న పార్ట్నర్ కోసం సెర్చ్ చేయడం, తన మ్యాచస్ కోసం పేరెంట్స్ కూడా విసిగిపోవడం వాంతి కథాంశంతో ఈ చిత్రం రానుంది. ఈశ్వర్ సినిమా ఫేమ్ హీరోయిన్ శ్రీ దేవి విజయ్ కుమార్ కమ్ బ్యాక్ ఇస్తున్నారు.

Also Read : Vijay : క్లాసిక్ హిట్ సినిమాను రిజెక్ట్ చేసిన విజయ్ దేవరకొండ

మూలా నక్షత్ర జాతకం కలిగిన వాడు 5నిమిషాల కంటే ఎక్కువ సేపు ఆనందంగా ఉండలేడు అని ఆ మధ్య రిలీజ్ అయిన టీజర్ లోని డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. వాస్తవానికి ఈ సినిమా గతేడాది సెప్టెంబరు 6న థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నామని అప్పట్లో అఫీషియల్ గా ప్రకటించారు మేకర్స్. కానీ అనుకోని కారణాల వలన రిలీజ్ వాయిదా వేశారు. ఇక ఇప్పడు దాదాపు 11 నెలల అనంతరం సుందరకాండ థియేటర్స్ లోకి వస్తుంది. అయితే ఈ సినిమా డిజిటల్ రైట్స్ మంచి ధర పలికాయి. ప్రముఖ ఓటీటీ సంస్థ హాట్ స్టార్ సుందరకాండ డిజిటల్ + సాటిలైట్ రైట్స్ ను రూ. 9 కోట్లకు కొనుగోలు చేసింది. ఇక హిందీ డబ్బింగ్ మరియు ఆడియో రైట్స్ రూపంలో రూ. 3 కోట్లు వచ్చాయి. మొత్తంగ నాన్ థియేట్రికల్ రైట్స్ రూ. 12 కోట్ల ధర పలికాయి. అన్ని అడ్డకుంలు దాటి, అన్ని హంగులు పూర్తి చేసుకున్న నారా వారి అబ్బాయ్ సుందరకాండ ఆగస్టు 27న వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది.

Exit mobile version