టాలీవుడ్ సినీ పరిశ్రమలో విప్లవాత్మకమైన మైలురాయిగా నిలిచే చిత్రంగా “హనీ కిడ్స్” రూపొందిస్తున్నట్టు మేకర్స్ వెల్లడించారు. ఈ చిత్రం భారతదేశంలో మొట్టమొదటి పూర్తి స్థాయి 100% VFX ఆధారిత సినిమాగా గుర్తింపు పొందబోతోందని వారు పేర్కొన్నారు. ఈ సినిమాను దర్శకుడు హర్ష.ఎం డైరెక్ట్ చేస్తుండగా ఫాంటసీ-సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో సాగనుందని అంటున్నారు. దర్శకుడిగా కొన్ని సినిమాలు చేసిన తల్లాడ సాయికృష్ణ, అమ్మినేని స్వప్నా చౌదరి, నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ, కిషోర్ దాస్,వినోధ్ నువ్వుల, కృష్ణ, తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. వీరి నటనకు తోడు అత్యాధునిక గ్రాఫిక్స్ టెక్నాలజీ ఈ సినిమాను అద్భుతమైన విజువల్ అనుభవంగా మార్చబోతోందని మేకర్స్ పేర్కొన్నారు. ఈ సినిమాకు తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మాత. సినిమా చివరి షెడ్యూల్ ఇటీవలే విజయవంతంగా పూర్తయ్యింది. ప్రేక్షకులను విభిన్నమైన దృశ్యాలను అనుభవించేలా చేసే ఈ సినిమా త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది. ఐతే ఈ సినిమా లో హీరోయిన్ పోస్టర్ లుక్ ని తాజాగా విడుదల చేసింది చిత్ర బృందం. ఈ సందర్భంగా స్వప్న చౌదరి అమ్మినేని మాట్లాడుతూ ఈ జోనర్ సినిమాలు పక్కా పిల్లలకి బాగా నచ్చుతుందని చెప్పుకొచ్చింది.
Honey Kids: ఇండియాలో ఫస్ట్ 100% VFX సినిమాగా “హనీ కిడ్స్”.. హీరోయిన్ లుక్ రిలీజ్

Honey Kids