ఒక ఆసక్తికరమైన ప్రకటనతో తెలుగు ప్రేక్షకుల ముందుకు మాత్రమే కాకుండా, పాన్-ఇండియా స్థాయిలో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచేందుకు సిద్ధమవుతోంది హోంబలే ఫిల్మ్స్ సంస్థ. హోంబలే ఫిల్మ్స్ నుంచి ‘మహావతార సినిమాటిక్ యూనివర్స్’ అంటూ వరుస సినిమాలను ప్రకటించారు.
Also Read : Varalaxmi Sarathkumar : హాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న వరలక్ష్మి శరత్ కుమార్
అందులో భాగంగా 2025లో ‘మహావతార నరసింహ’, 2027లో ‘మహావతార పరశురామ’, 2029లో ‘మహావతార రఘునందన’, 2031లో ‘మహావతార ద్వారకాదీశ’, 2033లో ‘మహావతార గోకులనంద’, 2035లో ‘మహావతార కల్కి పార్ట్ వన్’, 2037లో ‘మహావతార కల్కి పార్ట్ టూ’ వంటి సినిమాలను రూపొందించబోతున్నట్లు వెల్లడించారు. అంతేకాదు, ‘మహావతార కామిక్స్’ ఇష్యూ వన్ నుంచి మొదలుపెట్టి 100 ఇష్యూలను పబ్లిష్ చేయబోతున్నట్లు తెలిపారు. అలాగే, ‘మహావతార బ్రహ్మాండ’ అనే గేమ్‌ను కూడా డెవలప్ చేయబోతున్నట్లు ప్రకటించారు.
Also Read : Kuberaa : 100 కోట్ల ‘కుబేరు’డు!
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, దీనిని ‘మహావతార సినిమాటిక్ యూనివర్స్ (ఎంసీయూ)’ అని పిలుస్తున్నారు. ఈ సినిమాటిక్ యూనివర్స్ కోసం హోంబలే ఫిల్మ్స్ సంస్థ, క్లీమ్ ప్రొడక్షన్స్ అనే మరో సంస్థతో జట్టుకడుతోంది. ఈ సిరీస్ మొత్తాన్ని అశ్విన్ కుమార్ దర్శకత్వం వహించబోతుండగా, సుమారు 12 సంవత్సరాల పాటు ఈ సిరీస్‌లోని సినిమాలు రిలీజ్ కాబోతున్నట్లు ప్రకటించారు. ఈ సిరీస్‌కు నిర్మాతలుగా శిల్పా ధవన్, కుశల్ దేశాయ్, చైతన్య దేశాయ్ వ్యవహరించబోతున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో ఈ సినిమాలను రిలీజ్ చేయబోతున్నట్లు వెల్లడించారు.
