Site icon NTV Telugu

NANI : హిట్ – 3వ రోజు.. హౌస్ ఫుల్స్.. మొత్తం కలెక్షన్స్ ఎంతంటే.?

Hit3

Hit3

నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన సినిమా హిట్ 3. యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మే డే కానుకగా 1వ తేదీన వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. టీజర్, ట్రైలర్ తో భారీ హైప్ తెచ్చుకున్న ఈ సినిమా భారీ ఎత్తున రిలీజ్ అయింది. తమిళ్ స్టార్ హీరో సూర్య సినిమా రెట్రోతో పోటీని ఎదుర్కున్న హిట్ 3 తోలి ఆట నుండే హిట్ టాక్ అందుకుంది. హింసపాళ్ళు కాస్త ఎక్కువయ్యాయని కంప్లైంట్ ఉన్నకలెక్షన్స్ పై ఏ మాత్రం ప్రభావం చూపలేదు.

Also Read : AA22 : అల్లు అర్జున్ కోసం రంగంలోకి స్టీవెన్స్.. న్యూ లుక్ లోడింగ్

అడ్వాన్స్ బుకింగ్స్ లో జోరు చూపించిన హిట్ 3 మొదటి రోజు అంతే జోష్ చూపించింది. హిట్ 3 మొదటి రోజు వరల్డ్ వైడ్ గా రూ. 43 కోట్లు రాబట్టి నాని కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ అందుకున్న సినిమాగా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక రెండవ రోజు వర్కింగ్ డే నాడు సూపర్ స్ట్రాంగ్ కలెక్షన్స్ రాబట్టి మొతం టు డేస్ కు గాను రూ. 62 కోట్లు కొల్లగొట్టింది. ఇక వీకెండ్ రోజు అయిన శనివారం హౌస్ ఫుల్స్ బోర్డ్స్ తో సూపర్బ్ కలెక్షన్స్ రాబట్టి ఇప్పటివరకు రిలీజ్ అయిన మూడు రోజులకు గాను రూ. 82 కోట్లు వసూలు చేసాడు అర్జున్ సర్కార్. అందుకు సంబందించిన అఫీషియల్ పోస్టర్ కూడా రిలీజ్ చేసారు మేకర్స్. ఈ వీకెండ్ ముగిసే నాటికి హిట్ 3 వంద కోట్ల క్లబ్ లో చేరేందుకు దూసుకెళ్తోంది. అటు ఓవర్సీస్ లోను హిట్ 3 భారీ వసూళ్లు దిశగా సాగుతోంది.

Exit mobile version