Site icon NTV Telugu

NANI : హిట్ 3 ఓవర్సీస్.. మరొక మైల్ స్టోన్

Hit

Hit

నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన సినిమా హిట్ 3. యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మే డే కానుకగా 1వ తేదీన వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. టీజర్, ట్రైలర్ తో భారీ హైప్ తెచ్చుకున్న ఈ సినిమా భారీ ఎత్తున రిలీజ్ అయింది. భారీ అంచనాల మధ్య వచ్చిన హిట్ – 3 తోలి ఆట నుండే హిట్ టాక్ తెచ్చుకుంది.హిట్ 3 మొదటి రోజు వరల్డ్ వైడ్ గా రూ. 43 కోట్లు రాబట్టి నాని కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ అందుకున్న సినిమాగా సెన్సేషన్ క్రియేట్ చేసింది.

Also Read : Nandamuri Balakrishna : 50 ఏళ్లు హీరోగా.. ప్రపంచంలో ఏవరూ లేరు

తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో కూడా హిట్ 3 దూసుకెళ్తోంది. అడ్వాన్స్ బుకింగ్స్ లో 450K డాలర్స్ తో స్టార్ట్ అయిన ఈ సినిమా హిట్ టాక్ రావడంతో దూసుకెళ్ళింది. అడ్వాన్స్ మరియు డే 1 కలిపి హిట్ 3 నార్త్ అమెరికాలో 1 మిలియన్ డాలర్స్ రాబట్టింది. అలాగే నేచురల్ స్టార్ నాని హీరోయిన్ శ్రీనిధి శెట్టి నార్త్ అమెరికాలో ప్రమోషన్స్ ను భారీగా నిర్వహిస్తున్నారు. ఆడియెన్స్ కలిసి అక్కడి థియేటర్స్ లో సినిమా చూస్తూ ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. ఈ ప్రమోషన్స్ బాగా కలిసొచ్చాయని చెప్పాలి. శని, ఆదివారం కలిపి భారీ కలెక్షన్స్ రాబట్టింది హిట్ 3. దీంతో నార్త్ అమెరికాలో 2 మిలియన్ మార్క్ అందుకుంది. అందుకు సంబందించి అఫీషియల్ పోస్టర్ కూడా రెడీ చేసారు మేకర్స్. మొత్తానికి హిట్ 3  యూఎస్ మార్కెట్ లో విధ్వంసం చేస్తూ 3 మిలియన్ దిశగా దూసుకెళ్తోంది. మరి లాంగ్ రన్ లో ఎంత మాత్రం రాబడుతుందో చూడాలి.

Exit mobile version