Site icon NTV Telugu

HHVM : హరిహర హైదరాబాద్ సిటీ అడ్వాన్స్ సేల్స్.. ఇలా అయితే కష్టమే వీర

Hhvm (3)

Hhvm (3)

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం ‘హరి హర వీరమల్లు’.  అనేక అడ్డంకులు దాటి నేడు భారీ ఎత్తున రిలీజ్ అయింది. పీరియాడికల్ డ్రామా నేపధ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు ఎ.ఎం. జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకులు. నిధి అగర్వాల్, బాబీ డియోల్ ముఖ్య పాత్రలు పోషించారు. ప్రీమియర్స్ నుండే హరిహర వీరమల్లు ఏపీలో రికార్డులు సృష్టిస్తూ వెళ్తున్నాడు. కానీ నైజాంలో ఎందుకనో అడ్వాన్స్ బుకింగ్స్ లో జోరు ప్రదర్శించడం లేదు.

హైదరాబాడ్ అడ్వాన్స్ బుకింగ్ డే 1 కలక్షన్స్ ( బుక్ మై షో ) ఒకసారి పరిశీలిస్తే కేవలం రూ. 6.88 కోట్లు గా ఉంది. మొత్తం 965 షోస్ కు గాను 60%  ఆక్యుపెన్సీ కలిగి ఉంది.

హైదరాబాద్ లో హయ్యెస్ట్ అడ్వాన్స్ సేల్స్ రాబట్టిన సినిమాల లిస్ట్ చూస్తే..
1. రెబల్ స్టార్  కల్కి2898AD – రూ. 16.2 కోట్లు
2. యంగ్ టైగర్  దేవర – రూ. 15.7కోట్లు
3. పుష్ప 2  – రూ. 14.2కోట్లు
4.RRR – రూ. 10.8కోట్లు
5. గుంటూరు కారం – రూ. 10.6కోట్లు
6. సలార్  – రూ. 10.4కోట్లు
7. గేమ్ ఛేంజర్ – రూ. 8.84కోట్లు
8. హరిహర వీరమల్లు  – రూ. 6.88కోట్లు 

 నైజాం రైట్స్ ను మైత్రీ మూవీస్ దాదాపు రూ. 37 కోట్లకు అటు ఇటుగా కొనుగోలు చేసింది. ఇప్పుడు ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే రాబోయే మూడు రోజులు చాలా కీలకం. ప్రీమియార్స్ రూపంలో భారీగానే రాబట్టిన హరిహర వీరమల్లు సాలిడ్ రాబట్టాల్సి ఉంది. పోటీలో మరే ఇతర సినిమాలు లేకపోవడం కాస్ట్ కలిసొచ్చే అంశం. 

Note : పై కలెక్షన్స్ వివిధ మాధ్యమాల ద్వారా సేకరించబడినవి..

Exit mobile version