Hero Vishal: హీరో విశాల్‌కు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.. వేదికపైనే స్పృహ తప్పి పడిపోయారు విశాల్.. తమిళనాడులోని విల్లుపురంలో ఈ ఘటన జరిగింది.. విల్లుపురంలో ఈ రోజు జరిగిన కూవాకం కూతాండవర్ దేవాలయ ఉత్సవాన్ని పురస్కరించుకుని తిరునంగైవుల అలకిప్ పోటీ నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి నటుడు విశాల్, ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు.. అయితే, ఆ వేదికపై ఆయన స్పృహతప్పి పడిపోయారు.. అయితే, ప్రాథమిక చికిత్స తర్వాత అనారోగ్యం నుంచి కాస్త తేరుకున్నారు విశాల్.. ఈ ఘటనతో ఆ కార్యక్రమంలో కొద్దిసేపు కలకలం రేగింది.. కాగా, గత జనవరిలో మదగజరాజా చిత్ర ప్రమోషన్‌లో పాల్గొన్న విశాల్‌ను చూసి అంతా షాక్ తిన్నారు.. అతని ఆరోగ్యం గురించి పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ప్రస్తుతం విశాల్ మళ్లీ స్పృహతప్పి పడిపోయిన ఘటన అభిమానులను మరింత ఆందోళనకు గురిచేస్తోంది.. ఇక, ప్రాథమిక చికిత్స తర్వాత సమీపంలోని ఆస్పత్రికి విశాల్‌ను తరలించారు.. ఆహారం తినకపోవడంతోనే విశాల్ స్పృహ కోల్పోయినట్లు వైద్యులు తెలిపినట్టుగా తెలుస్తుండగా.. అరగంట విశ్రాంతి అనంతరం తిరిగి కార్యక్రమానికి హాజరయ్యారు విశాల్..
Read Also: Deputy CM Pawan Kalyan: రక్షణ దళాల సిబ్బందికి గుడ్‌న్యూస్.. పవన్ కీలక ప్రకటన
